calender_icon.png 15 April, 2025 | 4:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోదీని దించే సమయం ఆసన్నమైంది

14-04-2025 02:04:55 AM

  1. మనది సెక్యులర్ దేశం
  2. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింల ధర్నాలో పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): ప్రధాని మోదీని దించే సమయం ఆసన్నమైందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం తెచ్చిన వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ నగరంలోని ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం భారీ ధర్నా నిర్వహిం చారు.

నల్ల జెండాలు, జాతీయ జెండాలు, ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. వక్ఫ్ బిల్లును ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు. ఈ ధర్నాకు మహేశ్‌కుమార్ గౌడ్ సంఘీభావం తెలిపి, మాట్లాడారు. భారత్ సెక్యులర్ దేశమని, ఇక్కడ అందరూ సమానమేనని  అన్నారు. తెలంగాణలో ప్రధా ని మోదీ, అమిత్‌షా తెచ్చిన చట్టం చెల్లదని, ఇక్కడ సీఎం రేవంత్‌రెడ్డి, రాహుల్ గాంధీ నిర్ణయాలే చెల్లుతాయని పేర్కొన్నారు.

ఉత్తరప్రదేశ్ కు చెందిన ఎంపీ ఇమ్రాన్ మహమ్మద్ మాట్లాడుతూ.. వక్ఫ్‌బోర్డ్ పేరిట పార్లమెంటులో ప్రధాని మోదీ అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. ముస్లింల ఆస్తులపై కేంద్ర ప్రభుత్వ పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ, వక్ఫ్‌బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుసేని, భయం ఖురేషి, ఉస్మాన్ అల్హాద్రి పాల్గొన్నారు.