18-03-2025 12:00:00 AM
వాషింగ్టన్, మార్చి 17: స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో ఉత్పన్నమైన సమస్యల కార తొమ్మిది నెలలపాటు అంతరిక్ష అంతర్జాతీయ కేంద్రం(ఐఎస్‌ఎస్)లోనే ఉండి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమ్మీదకు చేరేందుకు ముహూర్తం ఖరారైంది. అమెరికా కాలమానం ప్రకారం మం సాయంత్రం 5:57 గంటలకు( భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 గంటలకు) సునీత, విల్మోర్‌లు భూమ్మీదకు చేరనున్నారు.
ఈ వి షయాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) ప్రకటించింది. సునీత, విల్మోర్‌లతోపాటు మరో ఇద్దరు వ్యోమగాములను భూమ్మీదకు తీసుకొచ్చే స్పెస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలా ల్లో మంగళవారం సాయంత్రం దిగనున్నట్టు పేర్కొంది.
వ్యోమగాములను తొలుత బుధవారం నాడు భూమి మీదకు తీసుకురావాల ని భావించినప్పటికీ వాతావరణ పరిస్థితుల అనుకూలత వల్ల తమ ప్రణాళికను మంగళవారమే అమలు చేయాలని నిర్ణయించుకు న్నట్టు వెల్లడించింది. అంతేకాకుండా సునీత, విల్మోర్‌లను భూమ్మీదకు తీసుకొచ్చే ప్రక్రి య అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10:45 గంటలకు స్పెస్‌ఎక్స్ డ్రాగన్ హ్యాచ్ మూసివేత ప్రక్రియతో ప్రారంభంకానున్నట్టు తెలిపింది.
నాసా-స్పేస్‌ఎక్స్ సంయుక్తంగా ప్రయోగించిన స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ అంతరిక్ష నౌక ఆదివారం ఐఎస్‌ఎస్‌తో విజయంతంగా అనుసంధానమైంది. క్రూత మిషన్‌లో భాగంగా నలుగురు వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నారు.
తిరుగు పయనంలో కీలక ఘట్టాలు
అంతరిక్షంలో ఐఎస్‌ఎస్‌తో అనుసంధానమైన స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ వ్యోమనౌక హ్యాచ్ మూసివేత ప్రక్రియ అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10:45 గంటలకు మొదలవుతుంది. ఈ ప్రక్రియ 12:45 గంటల వరకూ కొనసాగి, ఆ తర్వాత ఐఎస్‌ఎస్ నుంచి వ్యోమనౌక విడిపోయే ప్రక్రియ ప్రారంభమవుతుంది.
ఐఎస్‌ఎస్ నుంచి వ్యోమనౌక విజయవంతంగా విడిపోయిన అనంతరం.. మంగళవారం సాయం 4:45 గంటలకు భూమి వైపు తన ప్ర ప్రారంభమవుతుంది. ఈ క్రమంలోనే సాయంత్రం 5:57 గంటలకు క్రూ డ్రా క్యాప్సుల్ ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగుతుంది. అనంతరం క్యాప్సుల్ నుంచి వ్యోమగాములను పడవల ద్వారా అధికారులు నేలపైకి తీసుకొస్తారు.
ట్రంప్, మస్క్‌కు కృతజ్ఞతలు
భూమ్మీదకు వస్తున్న సందర్భంగా డొనాల్డ్ ట్రంప్, స్పేస్‌ఎస్ అధినేత ఎలాన్ మస్క్‌కు వ్యోమగాములు సునీతా విలియ మ్స్, బుచ్ విల్మోర్ కృతజ్ఞతలు తెలియజేశారు. తమను భూమి మీదకు తీసుకొచ్చేం దుకు ఇరువురు నేతలు చేసిన ప్రయత్నాలను ఓ వీడియో ద్వారా అభినందించారు.