25-02-2025 06:52:46 PM
ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదంటున్న బాధిత రైతు..
టేకులపల్లి (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని టేకులపల్లి మండలం గంగారం పంచాయతీ సంపత్ నగర్ గ్రామంలోని సర్వేనెంబర్ 33/2/84, పట్టా నెంబర్ 670 లో గల 20 ఎకరాల భూమిలో రైతు మద్దిపాటి వెంకటేశ్వరరావు సాగు చేసుకుంటున్న జామాయిల్ తోటను రాత్రి సమయంలో కొందరు వ్యక్తులు నరికి ట్రాక్టర్ల ద్వారా రవాణా చేసుకున్నారని రైతు మంగళవారం టేకులపల్లిలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రైతు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. టేకులపల్లి మండలం సంపత్ నగర్ సమీపంలోని తన సొంత వ్యవసాయ క్షేత్రంలో గత కొద్ది సంవత్సరాలుగా జామాయిల్ తోటను పండిస్తున్నట్లు తెలిపారు.
రైతు స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం రామన్నగూడెంకు చెందిన వ్యక్తి. ప్రస్తుతం టేకులపల్లి మన సంపత్ నగర్ నివాసం ఉంటూ తనకున్న 20 ఎకరాల భూమిలో జామాయిల్ తోటను సాగు చేసి మొదటి పంటను మూడు సంవత్సరాల క్రితం నరికి రెండో పంట చేతికి రావడంతో కోతకు రావడంతో నరికించాలని మాట్లాడుతున్న క్రమంలో తన తోటలో కొందరు వ్యక్తులు జామాయిల్ తోటను నరికి ట్రాక్టర్లో తరలిస్తున్నారని సమాచారం రావడంతో రైతు అక్కడికి వెళ్లి ట్రాక్టర్లను ఆపి విచారించగా చింతోనిచెలక గ్రామానికి చెందిన ఏలూరు కోటేశ్వరరావు, సంపత్ నగర్ కు చెందిన కొమరం చిట్టిబాబు అనే ఇద్దరు వ్యక్తులు తోట తమదే అని శంకర అనే వ్యాపారితో బేరం మాట్లాడుకుని కూలీల సాయంతో జామాయిల్ మొక్కలు నరికించి ట్రాక్టర్ ద్వారా రవాణా చేశారని తెలిపారు.
కూలీలను నిలదీయగా మమ్ములను కోటేశ్వరరావు, చిట్టిబాబు అనే వ్యక్తులు కూలీలుగా తీసుకొచ్చి నరికించారని తెలిపారన్నారు. ఈ విషయంపై కాంట్రాక్టర్ శంకర్కు ఫోన్ చేయగా ఆ భూమి యజమానులు ఏలూరు కోటేశ్వరావు, చిట్టిబాబు తనకు రూ. ఐదు లక్షలకు అమ్మారని తెలిపాడని వివరించారు. దానిపై చిట్టిబాబుకి ఫోన్ చేయగా మీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని మీ అంత చూస్తామని మీరు ఏమి చేయలేరని మీరు మీరు ఎక్కడి నుండో వచ్చి ఏజెన్సీ ప్రాంతంలో వ్యవసాయం చేస్తున్నారని 1/70 యాక్ట్ లో ఉన్న భూముల్లో మీరు ఎలా వ్యవసాయం చేస్తారని నాకు రౌడీ మాములు ఇవ్వకపోతే మీ అంత తెలుస్తాయని మీ భూములు కబ్జా చేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఈ విషయంపై 100 కి ఫోన్ చేయగా పోలీసులు స్పందించలేదని తెలిపారు.
తమ తోటలో ఆక్రమంగా కలపన నరికి తీసుకెళ్తున్న వారిపై స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన పోలీసులు స్పందించలేదని ఈనెల 21వ తారీకు సంఘటన జరిగిన నేటి వరకు పోలీసులు కేసు నమోదు చేయకుండా తాత్పర్యం చేస్తున్నారని. దీని వెనుక అంతర్యం ఏమిటో అర్థం కావట్లేదని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. తన తోటలో దొంగతనం జరిగితే పోలీసులు కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవని 100 రెండు సార్లు ఫోన్ చేసినా కనీసం సంఘటన స్థలానికి వచ్చి బోడు పోలీసులు విచారించలేదని అన్నారు. ప్రజలకు రక్షించే రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థ నిమ్మకు నీరు ఎత్తినట్లు ఉంటే సామాన్య ప్రజలు ఎలా జీవిస్తారని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా పోలీసులు తన తోటను ధ్వంసం చేసి దోచుకుని వెళ్తున్న దొంగలపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తనకు న్యాయం చేయాలని ఆయన కోరారు.