calender_icon.png 15 January, 2025 | 3:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెడికల్ షాప్ లో చోరీకి పాల్పడ్డ దుండగులు

05-11-2024 06:12:31 PM

బైక్ పై వచ్చి షాపు తాళం పగలగొట్టి ఐదు లక్షల అపహరణ

నిజామాబాద్ (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని  ఖలీల్ వాడి ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని ముగ్గురు దొంగలు బైక్ పై వచ్చి చోరికి పాల్పడ్డారు. మెడికల్ షాపు తాళాలు పాలగొట్టిన ముగ్గురు దుండగులు లోనికి చొరబడి మెడికల్ షాపులో ఉన్న ఐదు లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన సీసీ పుట్టేజిల్లో నమోదయింది. బాధితుని ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మెడికల్ షాపు పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.