ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్‌చెరు, జనవరి 13: హిందూ సంస్కృతి, సంప్రదాయాల్లో ముగ్గులకు విశిష్టత ప్రాధాన్యత ఉందని గూడెం మహి పాల్ రెడ్డి అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సోమవారం మండల పరిధిలోని ముత్తంగి సాయి ప్రియ కాలనీ లో సీనియర్ నాయకులు ఆబేద్, మేరాజ్ఖాన్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నిర్వాహ కులతో కలిసి మహిళలు వేసిన ముగ్గులను ఎమ్మెల్యే పరిశీలించారు.
అనంతరం న్యాయ నిర్ణేతలు నిర్ణయించిన విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని మహిళల కోసం ముగ్గుల పోటీలు ఏర్పాటు చేసిన ఆబేద్, మేరాజ్ఖాన్లను అభినందనీయ మన్నారు.
పండగ విశిష్టతను ప్రతిబిం బించేలా ముగ్గులు వేయడం పట్ల ఎమ్మెల్యే మహిళలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పోటీలలో పాల్గొన్న 126 మంది మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ మాజీ జడ్పీ సీ సుధాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఉపేందర్, మాజీ వైస్ ఎంపీపీ స్వప్న శ్రీనివాస్, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, రామకృష్ణ, మహిళలు పాల్గొన్నారు.