13-04-2025 12:21:33 AM
ఇయర్ బడ్స్ ఎక్కువసేపు వాడితే తాత్కాలిక లేదా శాశ్వత వినికిడి సమస్య వస్తుందని, లోపలి చెవిలో నొప్పి, చిరాకు, చెవిలో బ్యాక్టీరియా పెరిగే ముప్పు పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని చిన్నారులు, గర్భిణులు చాలా పరిమితంగా వాడాలని సూచిస్తున్నారు. ఈ జాగ్రత్తలు తెలుసుకుందాం..
*బ్లూటూత్ ఇయర్ బడ్స్, ఇయర్ ఫోన్స్ వాడేవారు పరిమిత స్థాయిలోనే వినడం ఉత్తమం.
*ఎక్కువసేపు వాడాల్సి వస్తే మధ్యలో కొంత సమయం గ్యాప్ ఇవ్వాలి.
*ఇయర్ బడ్స్ ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలి.
*ఒక రోజులో 60 నిమిషాల కంటే ఎక్కువసేపు ఇయర్ బడ్స్ వాడకుండా చూసుకోవాలి.