calender_icon.png 18 April, 2025 | 1:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫలించిన ఎమ్మెల్యే హామీ... తీరిన డబుల్ బెడ్ రూమ్ వాసుల దాహార్తి

10-04-2025 04:55:04 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ కాలనీవాసుల దాహార్తి తీరింది. ఇటీవల ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఇచ్చిన హామీ మేరకు గురువారం ఆ కాలనీలో రెండు బోర్లు వేయించారు. దీంతో కాలనీవాసుల దాహార్తి తీరినట్లు అయింది. ఇటీవల తమకు నీటి ఎద్దడి ఉందని కాలనీవాసులు ఎమ్మెల్యేకు విన్నవించుకున్న నేపథ్యంలో ఎమ్మెల్యే స్పందించి హుటాహుటిన మున్సిపల్ నిధుల లోంచి బోర్ లు వేయించి నీటి ఎద్దడి సమస్య పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు దొనికేని దయానంద్, పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ పడిగల భూషణ్, వైస్ చైర్మన్ అబ్దుల్ మజీద్, మున్సిపల్ మాజీ చైర్మన్ అంకం రాజేందర్, నంది రామయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు యూసుఫ్ ఖాన్, కే గంగ నరసయ్య, నాయకులు షౌకత్ బాషా, షబ్బీర్ భాష, యూనుస్, తదితరులు ఉన్నారు.