calender_icon.png 12 March, 2025 | 9:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముచ్చటగా మూడోసారి..

12-03-2025 12:09:04 AM

సమంత సినిమాల్లో మెల్లమెల్లగా యాక్టివ్ అవుతూ వస్తోంది. మయోసైటిస్ చికిత్స నిమిత్తం చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉండిపోయింది. నయమైన తర్వాత కూడా ఎందు కో సినిమాలేమీ అంగీకరించలేదు. తిరిగి ఇప్పుడిప్పుడే యా క్టివ్ అవుతోంది. ఇక సమంత తెలుగులో ఎప్పుడెప్పు డు సినిమా చేస్తుందా? అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూ స్తున్న అభిమానులకు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుందని టాక్.

ఈ క్రమంలోనే ఆమె ముచ్చటగా మూడోసారి ఓ దర్శకురాలికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. గతంలో మహిళా దర్శకురాలు నందిని రెడ్డితో కలిసి సమంత ‘జబర్దస్త్’, ‘ఓ బేబి’ వంటి చిత్రాల్లో నటించిన విషయం తెలిసిం దే. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరి కాంబోలో సిని మా రానుందట.

ఇప్పటికే సమంతకు నందినీరెడ్డి కథ వినిపించగా ఆమె ఓకే చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈసారి సమంత కోసం నందినీ రెడ్డి ఎలాంటి కథను ఎంచుకున్నారనేది ఆసక్తికరంగా మారింది. సమం త తెలుగులో సినిమా చేయనుందని అభిమానులు సం తోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వార్తలో నిజమెంతుందో తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే.