ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘దేవర’లోని ఫియర్ సాంగ్, చుట్టమల్లె అనే రెండు పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమాలోని మూడో సింగిల్ దావుడి పాట విడుదలకు రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ 4న మూడో సింగిల్‌ను విడుదల చేయనున్నట్లు దేవర మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ సాంగ్ షూట్ నుంచి ఎన్టీఆర్, జాన్వీలతో కూడిన రొమాంటిక్ పోస్టర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. శివ కొరటాల దర్శకత్వంలో నందమూ రి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్నా రు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నెగిటివ్ రోల్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 27న పలు భాషల్లో విడుదల కానుంది.