calender_icon.png 1 April, 2025 | 9:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర రైతు సంఘం మూడవ మహాసభలు విజయవంతం

28-03-2025 12:00:00 AM

రాష్ట్ర రైతు సంఘం కమిటీ ఎన్నిక, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నివేదిక సమర్పణ 

నిజామాబాద్, మార్చి 27 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మూడవ మహాసభలు విజయవంతంగా పూర్తయ్యాయని, నిజామాబాద్ లో రాష్ట్ర మహాసభలు నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు భాగం హేమంతరావు, ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ, మాజీ శాసనసభ్యులు ఉజ్జయిని యాదగిరిరావు లు అన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మూడో మహాసభలు ముగింపు కార్యక్రమం నిజామాబాద్ లోని బి ఎల్ ఎన్ ఫంక్షన్ హాల్ లో ఉదయం ప్రారంభమయ్యింది. ఈ సభ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా రాష్ట్ర అధ్యక్షులు భాగం హేమంతరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ లు వ్యవహరించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నివేదికను చదివి వినిపించారు. 14 తీర్మానాలను కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. అనంతరం నూతన రాష్ట్ర కమిటీ కమిటీని ఎన్నుకున్నారు. 27 మంది ఆఫీస్‌ఆఫీస్ బేరర్స్ ని ఎన్నుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం తీర్మానాలు ..

హైదారాబాద్ చుట్టూ ప్రక్కల గ్రామాల్లో 111 జీఓని ఎత్తి వేయాలని తీర్మానించారు. డాక్టర్ స్వామినాధన్ కమిషన్ సిఫార్సులకు చట్టబద్ధత  చేయాలని, కౌలు రైతులకు రైతు భరోసా, గుర్తింపై కార్డులు ఇవ్వాలని, దేవాదుల ప్రాజెక్ట్  ద్వారా ములుగు జిల్లాలోని అన్ని గ్రామాలకు సాగునీరు కల్పించాలని, రాష్ట్రంలోని, పోడు భూములకు, సాదా బైనామా దరఖాస్తు దారులకు పట్టాలు ఇవ్వాలని, పంటలకు పంటల బీమా పథకం ఏర్పాటు చేసి, రైతులు పండించిన పంటల నిల్వకు గోదాములు నియమించాలని,  మహబూబాబాద్ జిల్లాలో ఎర్రచందనం మార్కెట్ సౌకర్యం కల్పించాలి.

ములుగు జిల్లాలో నకిలీ విత్తవాలు, జన్యు మార్చిడి విత్తనాలు వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం కల్పించాలని, రైతు పండంచిన వరి ధాన్యాన్ని మార్కెట్ లో అమ్మడం కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని  ధాన్యం ఉత్పత్తి దారుల సంఘం ను రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయాలని, బైంసా మండలం రంగారావు  ప్రాజెక్ట్ ద్వారా గూడెం గ్రామంలో 450 కుటుంబాలు ముంపుకు గురువుతున్నారు వారికి నష్ట పరిహరం అందించాలని, జనగారం జిల్లాలో సనాబుపేట రిజర్వాయర్ ద్వార యాదాద్రి జిల్లా గుట్ట గంధమల్ల రిజర్వాయర్ లో పనులు పూర్తి చేయాలని,  సాగు నీరు అందించాలని, ఎస్‌ఎల్‌బీసీ సొరగం పూర్తి చేయాలి.

బ్రహ్మం వెల్లెల్లి ప్రాజెక్టును కృష్ణ పురం వరకు కాల్వలు ఏర్పాటు చేయాలి. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి. యాదాద్రి పవర్ ప్లాంట్ భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. వాజేడు మండలంలో రైతులకు సమ్మక్క సారక్క బ్యారేజీ ద్వారా సాగునీరు అందించాలి. మహిళా రైతులకు పాడి పరిశ్రమ,  కోళ్ల పరిశ్రమ పట్టు పరిశ్రమ పుట్టగొడుగుల పరిశ్రమ వీటికి 90% సబ్సిడీ ఇచ్చి మహిళా రైతులను ప్రోత్సహించాలని ఈ మహాసభ తీర్మానించారు.

55 సంవత్సరాలు నిండిన రైతులకు 10.000 రూపాయల పెన్షన్ అందించి, ఆరోగ్య కార్డులు ఇవ్వాలని, ఎకరానికి రెండు లక్షల పంట రుణం ఇవ్వాలని తీర్మానాలు చేయడం జరిగింది. .కార్యక్రమంలో సిపిఐ పార్టీ కార్యదర్శి పి సుధాకర్, ఏటీసీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై ఓమయ్య, ఆహ్వాన సంఘం రాష్ట్ర కోశాధికారి కంజర భూమయ్య, వడ్డీకే రాజేశ్వర్, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కమిటీ అధ్యక్షులుగా భాగం హేమంతరావు, ప్రధాన కార్యదర్శిగా పశ పద్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.