మార్కెట్లోకి విండ్సర్
హైదరాబాద్, సెప్టెంబర్ 11: ఎంజీ మోటార్ భారత మార్కెట్లోకి తన మూడవ ఎలక్ట్రిక్ కారు విండ్సర్ ఈవీని బుధవారం విడుదల చేసింది. జిందాల్ స్టీల్ వర్క్స్‌తో ఇటీవల చేతులు కలిపిన తర్వాత ఎంజీ మోటార్ విడుదల చేసిన కొత్త కారు ఇదే. ప్రారంభ ధరను రూ.9.99 లక్షలుగా (ఎక్స్ షోరూమ్) నిర్ణయించారు. ఈ కారును చైనాలో ఉలింగ్ క్లౌడ్ ఈవీ పేరుతో విక్రయిస్తున్నారు.
కొన్ని మార్పులు చేసి భారత్ మార్కెట్లో విడుదల చేస్తున్నారు. విండ్సర్ ఈవీ బుకింగ్స్ అక్టోబర్ 3న మొదలవుతాయని, టెస్ట్‌డ్రైవ్‌కు అక్టోబర్ 13 నుంచి అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్, ఎసెన్స్ పేర్లతో మూడు వేరియంట్లలో, నాలుగు రంగుల్లో లభిస్తుంది.