calender_icon.png 7 February, 2025 | 6:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడో రోజూ పెరిగిన పసిడి

07-02-2025 12:48:15 AM

హైదరాబాద్: దేశంలో బంగారం ధరలు ఆగకుండా పెరుగుతూ కొనుగోలుదారులకు దడపుటిటస్తున్నాయి. గురువారం వరసగా మూడో రోజూ పెరిగాయి. మూడు రోజుల్లో 10 గ్రాముల  బంగారంపై దాదాపు రూ.2,500 పెరిగింది. ఇప్పటికే రూ.86 వేలు దాటేసి సరికొత్త మార్కు దిశగా దూసుకెళ్తోంది.

హైదరాబాద్ సహా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో బంగారం 10 గ్రాముల ధర( 22 క్యారెట్లు ) రూ.250,, 24 క్యారెట్లపై రూ.270 చొప్పున పెరిగాయి. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 79,300, 24 క్యారెట్ల ధర రూ.86,510కు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 86,660కు, 22 క్యారెట్ల ధర రూ.79,450కి పెరిగాయి.

చెన్నై, బెంగళూరు, ముంబైలలో కూడా ఇదే స్థాయిలో పెరిగాయి. ఇక వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు హైదరాబాద్ తదితర నగరాల్లో కేజీ వెండి ధర రూ. 1,07,000గా ఉండగా, ఢిల్లీలో మాత్రం రూ.99,5000గా ఉంది.