లోహిత్ కల్యాణ్, రాజేశ్ కుంచాడా, జోషిత్ రాజ్‌కుమార్, కైలాష్ వేలాయుధన్, పూజా విశ్వేశ్వర్, టీవీ రామన్, ఆర్కే నాయుడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా రాజు గారి దొంగలు’. ఈ చిత్రాన్ని నడిమింటి లిఖిత సమర్పణలో హిటాసో ఫిలిం కంపెనీ బ్యానర్‌పై నడిమింటి బంగారునాయుడు నిర్మిస్తున్నారు. దర్శకుడిగా లోకేశ్ రనల్ హిటాసో వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో థియేటర్లలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర ప్రసాద్, నిర్మాత బెక్కెం వేణుగోపాల్, నటుడు జెమినీ సురేశ్ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర ప్రసాద్ మాట్లాడుతూ.. రాజు గారి దొంగలు’ టీజర్ బాగుంది. సినిమాను కూడా ఇలాగే కొత్తగా తెరకెక్కించాడని అనుకుంటున్నాను’’ అన్నారు.
బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ.. సినిమా అంటే చాలా మందికి ఒక ప్యాషన్ ఉంటుంది. కష్టపడితే మంచి పొజిషన్‌కు వెళ్లొచ్చు. రాజు గారి దొంగలు’ పోస్టర్, సాంగ్, టీజర్ బాగుంది. ఆర్టిస్టులంతా బాగా పర్ ఫార్మ్ చేశారు. దొంగ కాన్సెప్ట్‌తో వచ్చే సినిమాల్లో మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు’’ అని చెప్పారు. నటుడు జెమినీ సురేశ్ మాట్లాడుతూ.. మనం ఇతర భాషల సినిమాలు చూసి అరే భలే చేశారే మూవీ అనుకుంటాం. మనం కూడా ఇలా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అలాంటి ప్రయత్నం రాజు గారి దొంగలు’ సినిమాతో డైరెక్టర్ లోకేశ్ రనల్ హిటాసో చేశారు. టీజర్‌లోనే ఆ కొత్తదనం కనిపించింది’’ అని తెలిపారు. నటీనటులు లోహిత్ కల్యాణ్, రాజేశ్ కుంచాడా, జోషిత్ రాజ్‌కుమార్, కైలాష్, పూజా విశ్వేశ్వర్, దర్శకుడు లోహిత్ రనల్ హిటాసో, నిర్మాత నడిమింటి బంగారునాయుడు పాల్గొన్నారు. ఈ చిత్రానికి డీవోపీ: సందీప్ బదుల, ప్రకాశ్‌రెడ్డి; స్టోరీ రైటర్స్: సుమంత్ పల్లాటి, సూరాడ బ్రహ్మ విజయ్; మ్యూజిక్: నాఫల్ రాజా ఏఐఎస్; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాజవంశీ.