calender_icon.png 24 November, 2024 | 12:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జెన్‌కో ఆధ్వర్యంలోనే థర్మల్ కేంద్రాన్ని నిర్మించాలి

26-09-2024 03:20:00 AM

తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ  

హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): రామగుండంలో జెన్‌కో ఆధ్వర్యంలోనే 800 మెగావాట్ల థర్మ ల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జా యింట్ యాక్షన్ కమిటీ (టీజీపీఈజేఏసీ) డిమాండ్ చేసింది. సింగరేణి సంస్థతో కలిసి సంయుక్తంగా నిర్మించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరే కిస్తూ..

పలు నిరసన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వానికి తమ ఉద్దేశాన్ని తెలియజేయాలని జాక్ నిర్ణయించిం ది. బుధవారం 1104 యూనియన్ ఆఫీస్‌లో టీజీపీఈజేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. రామగుండంలోని ప్రస్తుత ఆర్‌టీఎస్‌బీ స్థానం లో జెన్‌కో, సింగరేణి సంయుక్త భాగస్వామ్యంతో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు జాక్ ప్రకటించింది.

ఈనెల 26 నుంచి బ్లాక్ బ్యాడ్జీలతో నిరసన తెలపాలని, ఈనెల 30 నుంచి అక్టోబర్ 3 వరకు అన్ని విద్యుత్ ఉత్పత్తి సంస్థల్లో గేట్ మీటింగ్‌లు నిర్వహించాలని, అక్టోబర్ 4 నుంచి 5 వరకు విద్యుత్ ఉత్పత్తి కేం ద్రాలతోపాటు కార్పొరేట్ కార్యాలయాలు, ట్రాన్స్‌కో, డిస్కంల జిల్లా, డివిజన్ కార్యాలయాల్లో లంచ్ అవర్ డిమాన్‌స్ట్రేషన్ చేయాలని నిర్ణయించారు.

దీనితోపాటు విద్యుత్ సౌధా లోనూ నిరసన వ్యక్తం చేయాలని నిర్ణ యం తీసుకున్నారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే.. తదుపరి కార్యాచరణను అక్టోబర్ 5న నిర్ణయిస్తామని జాక్ ప్రకటించింది.

సమావేశంలో జేఏసీ చైర్మన్ సాయిబాబా, కన్వీనర్ రత్నాకర్‌రావు, కో చైర్మన్ శ్రీధర్, కో కన్వీనర్ బీసీ రెడ్డి, వైస్ చైర్మన్ అనిల్‌కుమార్, వజీర్, శ్యామ్ మనోహర్, నాగ తులసిరాణి,  కరుణాకర్‌రెడ్డి, రాంజీ, సదానందం, వెంకట్ నారాయణరెడ్డి, సుధీర్, శ్రీనివాస్, ఈశ్వర్‌గౌడ్, వేణు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.