లండన్‌లోని నీల్స్ యార్డస్ కంపెనీలో ఘటన
న్యూఢిల్లీ, అక్టోబర్ 29: లండన్‌లోని నీల్స్ యార్డస్ డైరీ కంపెనీ గోడౌన్ నుంచి తాజాగా సుమారు 3 కోట్ల విలువైన 22 టన్నుల జున్ను దొంగతనానికి గురైంది. దీనిపై బ్రిటిష్ ప్రముఖ సెలబ్రెటీ చెఫ్ జామీ ఆలివర్ స్పందించారు. దొంగతనానికి గురై న జున్ను అత్యంత ఖరీదైన రకాల్లో ఒకటని పేర్కొన్నారు. దొంగతనం చేసిన వారిని పట్టుకోవడానికి సహాయం చేయాలని తన ఫాలోవర్లను కోరారు. ఎవరైనా ఖరీదైన జున్నును తక్కువ ధరకు అమ్ముతున్నట్టు గమనిస్తే సమాచారం అందించాలని సూ చించారు. కొద్ది రోజుల క్రితం నీల్స్ యార్డస్ డైరీ నుంచి దొంగలు చాలా చాకచక్యంగా జున్నును దొంగిలించారు. తమను తాము ఫ్రెంచ్ కంపెనీకి చెందిన డీలర్లుగా డైరీ ప్రతినిధులుగా పరిచయం చేసుకుని, చీజ్ డీలర్ షిప్ గురించి మాట్లాడలని చెప్పి 22 టన్నుల జున్ను తీసుకుని పరారయ్యారు. దొంగతనానికి గురైన జున్నును హ్యాండ్ మేడ్ చీజ్ కావడంతో అత్యంత ఖరీదు ఉంటుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.