12-03-2025 01:42:05 AM
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు
తుంగతుర్తి, మార్చి 11 : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రం లో వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో లో జరిగిన సమావేశం లో తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ఆమోదించిన ఎస్సీ- ఏబిసి వర్గీకరణ , బీసీ కులగనను ఈనెల 16 తారీకు తుంగతుర్తి నియోజకవర్గం కృతజ్ఞత సభ విజయవంతం చేయాలని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు అన్నారు.
మంగళవారం ముఖ్య కార్యకర్తల సమావేశం లో ఎమ్మెల్యే మాట్లాడారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సహకారంతో ఏబిసిడి వర్గీకరణకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. సమావేశంలో తెలంగాణ రాష్ర్ట రైతు సంక్షేమ కమిషన్ కమిటీ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ కిషన్ రావు మార్కెట్ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న మండల పార్టీ అధ్యక్షులు దొంగలు గోవర్ధన్ నాయకులు పాల్గొన్నారు.
పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయం
జాజిరెడ్డిగూడెం (అర్వపల్లి), మార్చి 11: పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు.మంగళవారం మండల కేంద్రం అర్వపల్లిలోని శ్రీరామ ఫంక్షన్ హాల్ లో జాజిరెడ్డిగూడెం,నూతనకల్,మద్దిరాల,అడ్డగూడూరు మండలాలకు సంబంధించి 96 మంది లబ్ధిదారులకు రూ.96 లక్షల 11వేల 136 ల విలువగల కళ్యాణలక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ పేదల ప్రభుత్వమని,పేద వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని,రాష్ర్టంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో ఆయా మండలాల తహశీల్దారులు,ఎంపీడీఓలు,మండలపార్టీ అధ్యక్షులు, గ్రామశాఖ అధ్యక్షులు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.