27-04-2025 12:09:21 AM
సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
వారసిగూడ, ఏప్రిల్ 26 (విజయక్రాంతి) : కాశ్మీర్ లోని పెహల్గాం లో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడి అమానుషమని సికింద్రాబాద్ శాససభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతులకు సంతాప సూచకంగా శనివారం సితాఫలమండీ లో కొవ్వొ త్తుల ర్యాలీ జరిగింది.
కార్యక్రమంలో పాల్గొ న్న పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడతూ ఉగ్రవాదుల దాడులను ఖండించాల్సి ఉందని, వారికీ తగిన గుణ పాఠం నేర్పాల్సి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ, రాసురి సునీత, లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.