* లేదా 70 ఏండ్ల వయసు వచ్చే వరకు కొనసాగింపు
* మార్గదర్శకాలు జారీ చేసిన ‘యూజీసీ’
* డ్రాఫ్ట్స్, పోస్టుల భర్తీపైనా స్పష్టమైన మార్గదర్శకాలు
* కాంట్రాక్ట్ టీచర్ అపాయింట్‌మెంట్స్ పరిమితి తొలగింపు ?
హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాం తి): యూనివర్సిటీల పరిధిలో వైస్‌ఛాన్స్‌లర్ (వీసీ) పదవీకాలం ఐదేండ్లు ఉండాలని లేదా వీసీకి 70 ఏండ్లు వయస్సు వచ్చే వర కు పదవిలో కొనసాగించవచ్చని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది.
కానీ.. తెలంగాణ పరిధిలోని వర్సిటీల్లో వీసీల పదవీ కాలం మాత్రమే మూడేండ్లే అమలవుతున్న ది. ఒకవేళ తాజా యూజీసీ మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేయాల్సి వస్తే.. సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంటుందనే ప్రశ్న ఇప్పుడు మొదలైంది.
డ్రాఫ్ట్ మార్గదర్శకాలు..
జాతీయ విశ్వవిద్యాలయాలు, కళాశాల ల్లో ఫ్యాకల్టీ నియామకానికి కనీస అర్హతలు, ఉన్నత విద్యలో ప్రమాణాల మార్గదర్శకాల ను సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విడుదల చేశారు. 2018లో యూజీసీ చివరిసారి మార్గదర్శకాలు విడుదల చేయగా, తాజాగా మరోసారి డ్రాఫ్ట్ మార్గదర్శకాలు విడుదలయ్యాయి.
ప్రొఫెసర్ పోస్టులను కేవలం మెరిట్ ఆధారంగానే సెలెక్షన్ కమిటీ ఎంపిక చేయాలని యూజీసీ సూచిస్తున్నది. అలాగే 2018 మార్గదర్శకాల్లో కాంట్రాక్ట్ టీచర్ అపాయింట్‌మెంట్స్‌ను కేవలం 10 శాతానికి పరిమితం చేసింది. ఇకపై ఆ పరిమితిని ఎత్తివేస్తున్నట్లు తెలిసింది.
పోస్టుల భర్తీకి మార్గదర్శకాలు..
అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసొసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల నియామకానికి జాతీయస్థాయిలో నోటిఫికేషన్ జారీ చేయాలి. సెలెక్షన్ కమిటీ ద్వారానే ఎంపిక చేయాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు పీజీలో కచ్చితంగా 55 శాతం మార్కులు ఉండాలి. రిజ ర్వేషన్ వర్తించే వారికి ఆ నిబంధనకు మినహాయింపు ఉంటుంది. నియమకానికి పీహె చ్‌డీ లేదా నెట్/సెట్ అర్హత ఉన్నా చాలు.
అసొసియేట్ ప్రొఫెసర్ పోస్టు భర్తీకి పీహెచ్‌డీ తప్పనిసరి. అలాగే అభ్యర్థికి ఎనిమిదేండ్ల పాటు బోధనా, పరిశోధనా రంగాల్లో అనుభవం ఉండాలి. వారు ముఖ్యమైన పరిశోధనా గ్రంథాలు రచించి ఉండాలి. ప్రొఫె సర్ పోస్టుకు 10 ఏండ్ల బోధనా అనుభవం తప్పనిసరి. ఈ కాలంలో అభ్యర్థి కనీసం మూడేండ్లు అసొసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేసి ఉండాలి.
అభ్యర్థికి గుర్తించదగిన విద్యా పరమైన విజయాలు, డాక్టోరల్ పర్యవేక్షణ చేసి ఉండాలి. కొన్ని ముఖ్యమైన పోస్టులకు పీహెచ్‌డీ తప్పనిసరి. పీహెచ్‌డీ సమయం బోధనాసమయం కాదు. ఇంటర్ డిసిప్లినరీ లో భాగంగా డిగ్రీ, పీజీల్లో ఏ సబ్జెక్టు తీసుకు న్నా పీహెడీ, నెట్/ సెట్ ఏ సబ్జెక్ట్ తీసుకుంటే అదే సబ్జెక్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
రీసె ర్చ్ అండ్ పబ్లిషింగ్ మెటీరియల్‌ను ప్రాం తీయ భాషల్లోనూ ముద్రించవచ్చు. వైస్‌ఛాన్స్‌లర్స్ నియామకాల నిబంధనలను సైతం యూజీసీ వెల్లడించింది. ప్రొఫెసర్‌గా కనీసం పదేండ్ల పాటు పనిచేసిన వారే వైస్ ఛాన్స్‌లర్ పోస్టుకు అర్హులని తేల్చిచెప్పింది.