హైదరాబాద్, అక్టోబర్ 9 (విజయ క్రాంతి): ఇటీవల కొత్తగా నియమించిన బీసీ కమిషన్ పదవీ కాలాన్ని ప్రభుత్వం మూడేళ్లుగా నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులకు కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, సభ్యులకు మాదిరిగానే జీతభత్యాలు, సౌకర్యాలు కల్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ప్రస్తుత బీసీ కమిషన్ సెప్టెంబర్ 9, 2024న బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో సెప్టెంబర్ 9, 2027 వరకు వీరు బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులుగా కొనసాగనున్నారని స్పష్టం చేసింది. ఉత్తర్వుల్లోని అంశాలను వెంటనే అమలు చేయాలని బీసీ కమిషన్ మెంబర్ సెక్రటరీని ఆదేశించింది.