కూతురి మృతి, తండ్రికి గాయాలు
బేగంపేట లైఫ్‌స్టుల్ వద్ద ఘటన
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 26 (విజయక్రాంతి): నరగంలో వరుసగా చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. గత వారం హబ్సిగూడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పదవ తరగతి విద్యార్థిని మరణించిన ఘటన మరవకముందే.. తాజాగా బేగంపేటలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఓ యువతి దుర్మరణం చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. బేగంపేట లైఫ్‌స్టుల్ వద్ద టెంపో వాహనం ఢీకొని బైక్‌పై వెళ్తున్న తండ్రి తీవ్ర గాయాలు కాగా, కూతురు అక్కడికక్కడే మృతిచెందింది.
పోలీసులు తెలిపిన వివరాలు.. ఖమ్మం జిల్లా మణుగూరు ఎస్పీఎఫ్ ఎస్‌ఐగా పనిచేస్తున్న శంకర్‌రావు తన కూతురు ప్రసన్న(22)ను కాలేజీలో దించేందుకు బైక్‌పై బేగంపేట నుంచి పంజాగుట్ట వెళ్తుండగా వెనక నుంచి వేగంగా వచ్చిన టెంపో వారి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రసన్న అక్కడికక్కడే మృతిచెందింది. తండ్రి శంకర్‌కు తీవ్ర గాయాలు కావ డంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టెంపో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.