12-02-2025 01:51:27 AM
వేములవాడ, ఫిబ్రవరి 11: రానున్న మహాశివరాత్రి జాతర నేపథ్యంలో వేములవాడ శ్రీరాజరా జేశ్వరస్వామి ఆలయ పరిసర ప్రాంతా ల్లో ఉన్న డ్రైనేజీలను, పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలని వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ అధికారులను ఆదేశించారు.
మంగళ వారం వేములవాడ రాజన్న ఆలయ పరి సర ప్రాంతాల్లోని మురికి కాలువలను ఆల య అధికారులతో ఆయన పరిశీలించారు. మహాశివరాత్రి జాతరను పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో రాజన్నలయ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు మురికి కాలువలను శుభ్రం చేయించాలన్నారు.
ఎప్పటికప్పుడు పారిశుద్ధ లోపం లేకుండా అధికారులు పర్యవేక్షించాలన్నారు. ఆయన వెంట ఆలయ డిఈ మైపాల్ రెడ్డి ఏఈ రామకృష్ణ, ఏఈఓ అశోక్, సానిటేషన్ పర్యవేక్షకులు నరసయ్య ,ఎంక్వురై ఆఫీస్ పరివేక్షకులు శ్రీకాంతచారి, ఆలయ, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.