రైతు నాయకుడు తీర్థలా కొమురేల్లి డిమాండ్...
ముత్తారం (విజయక్రాంతి): గత 8 ఏండ్ల క్రితం ఖమ్మంపల్లిలో గుట్టలకు పట్టాలు చేసిన అప్పటి తహసీల్దార్ పుష్పలతను సస్పెండ్ చేయాలని రైతు నాయకుడు తీర్థాల కొమురేల్లి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ముత్తారంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి గ్రామ పంచాయతీ శివారులోని ఎర్రమట్టి గుట్టలను, పరుపు బండలను తహసీల్దార్ పుష్పలత డబ్బులు దండుకొని గుట్టలకు పట్టాలిచ్చిందని ఆయన పేర్కొన్నారు. నా భూమి పట్టా చేయుటకు లంచంగా రూ. 50,000/- రూపాయలు తీస్కొని నాకు పట్టా చేయకుండా నా భూమిని అక్రమంగా కర్రే శాంతమ్మ వద్ద రూ.లక్ష రూపాయలు లంచంగా తీస్కొని నా భూమి ఆమెకు పట్టా చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముత్తారం మండల మాజీ తహసీల్దార్ ను సస్పెండ్ చేసి శాఖపరమైన చర్యలతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోని, ఆమెను శాశ్వతంగా విధుల నుండి తొలిగించాలని కొమురెల్లి జిల్లా కలెక్టర్ ను డిమాండ్ చేశారు.