19-04-2025 08:04:30 PM
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి..
పటాన్ చెరులో ఘనంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం..
పటాన్ చెరు: ఏసుక్రీస్తు బోధనలు ఆచరణీయమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Gudem Mahipal Reddy) అన్నారు. ఆయన బోధనలు విశ్వ మానవ సమానత్వానికి దోహదం చేశాయని తెలిపారు. గుడ్ ఫ్రైడే పురస్కరించుకొని శనివారం పటాన్ చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన రన్ ఫర్ జీసస్ ద్విచక్ర వాహనాల ర్యాలీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ, అనురాగం ఆప్యాయతో మెలగాలని క్రీస్తు తన బోధనల ద్వారా విశ్వవ్యాప్తంగా ప్రచారం చేశారని తెలిపారు. నియోజకవర్గంలో నూతన చర్చిల నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, పృథ్వీరాజ్, జీవన్, నరేష్, వివిధ క్రిస్టియన్ సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.