calender_icon.png 23 April, 2025 | 4:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తమ ఫలితాలు సాధించిన ఖమ్మం గురుకుల విద్యార్థినులతో అధ్యాపక బృందం

23-04-2025 12:33:56 AM

ఇంటర్ ఫలితాల్లో మెరుగైన ఫలితాలు 

ఖమ్మం, ఏప్రిల్ 22( విజయక్రాంతి ):-ఇంటర్మీడియట్ ప బ్లిక్ పరీక్షా ఫలితాలలో ఖమ్మం జిల్లా విద్యార్థులు మెరుగైన ఉత్తీర్ణత సాధించారు.ప్రధమ సంవత్సరం జనరల్ లో 15584 విద్యార్థులకు గాను 11088 మంది. ఉత్తీర్ణులై 71.15 శాతం సాధించి రాష్ట్రంలో మూడోవ స్థానం లో అదేవిధంగా ద్వితీయసంవత్సరంలో జనరల్ లో 14876 విద్యార్థులకు గాను 11557 మంది ఉత్తీర్ణులై 77.06 శాతం సాధించి రాష్ట్రంలో ఐదవ స్థానం సాధించారు.

ప్రధమ సంవత్సరం వృత్తివిద్యా కోర్స్ లలో2253 విద్యార్థులకు గాను 1388 మంది ఉత్తీర్ణులై 61.61 శాతం సాధించి రాష్ట్రంలో నాల్గొవ స్థానం లో, ద్వితీయ వృత్తివిద్యా కోర్స్ లలో 2043 విద్యార్థులకు గాను 1439 మంది ఉత్తీర్ణులై 70.44 శాతం సాధించినట్లు డి ఐ ఇ ఓ కే.ర వి బాబు తెలిపారు.గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధిక ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు.

రి-వెరిఫికేషన్ కు ప్రతి పేపర్ కు 600 రూపాయలు చొప్పున, రి-కౌంటింగ్ కు ప్రతి పేపర్ కు 100 రూపాయలు చొప్పున, ఈ నెల 23. నుండి 30వ తేదీ  వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కలిపిస్తారని పేర్కొన్నారు.

ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ విద్యార్థులకు తక్కువ మార్కులు వచ్చాయని, ఫెయిల్ ఆయనమని ఆందోళలన చెందవద్దని, ఎటువంటి తొందరపాటి నిర్ణయాలు తీసుకోవద్దని అన్నారు. తల్లీతండ్రు లు తమ పిల్లల మానసిక పరిస్థితి గమనించి వారికీ సరైన సూచనలు ఇవ్వాలని కోరారు..

గురుకుల విద్యార్థినిల ప్రతిభ 

ఖమ్మం రాపర్తి నగర్ లోని తెలంగాణ మైనారిటీ గురుకుల కళాశాల ( బాలికలు) విద్యార్థినిలు రాష్ట్రస్థాయిలో ఉత్తమమైన ఫలితాలను సాధించారు .ఎంపీసీ,  బైపీసీ గ్రూపులలో 1000 మార్కులకు గాను  సాలె శరణ్య 990,హసీనా 988, ఎమ్.క ల్పన 985 మార్కులతో  విజయం సాధించగా, ప్రథమ సంవత్సరం ఎంపీసీ లో 470 కు గాను సన్నీ 465, ఫర్జీన్ ఫిర్దోజ్, దీప్తి శ్రీ 461 మార్కులు సాధించగా బైపీసీ లో 440 కు గాను కుసుమ 427, గ్రీష్మ, షోను లు 425 మార్కులు సాధించారు.

రెండవ సంవత్సరంలో 31 మంది విద్యార్థినులు 900 పైగా మార్కులతోనూ, మొదటి సంవత్సరంలో 23 మంది విద్యార్ధినులు 400 పైగా మార్కులతో విజయ కేతనం ఎగురవేశారని కళాశాల ప్రిన్సిపల్ చుండు అఖిల తెలిపారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గురుకుల విద్యాసంస్థలలో చదువు తున్న తమ విద్యార్థినులు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించడం గర్వకారణమన్నారు.