calender_icon.png 4 February, 2025 | 8:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాజంలో ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది

03-02-2025 12:00:00 AM

పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్‌రెడ్డి 

తాడ్వాయి, జనవరి 2 (ఫిబ్రవరి): సమాజంలో ఉపాధ్యాయ వృత్తి పవిత్రమై నదని పిఆర్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి తెలిపారు కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమి కలాన్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం నిర్వహిం చిన పదవీ విరమణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఉన్నత పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయుడు రమేష్ పదవి విరమణ పొందారు ఆయన పదవీ విరమణ కార్యక్రమానికి విచ్చేసి దామోదర్ రెడ్డి మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఉపాధ్యాయుడు అంకితభావంతో పనిచేయాలని సూచించారు గ్రామాల్లోని పేద ప్రజలే ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు పంపిస్తున్నారని వారి కలలను నెరవేర్చాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘం నాయకులు మనోహర్ రావు ఎంఈఓ రామస్వామి గ్రామ పెద్దలు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.