కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి
ముషీరాబాద్, డిసెంబర్ 1: (విజయక్రాంతి): సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని.. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై ఉన్నదని కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఙాన కేంద్రంలో అంబర్‌పేట మండల్ రికగ్నైజ్డ్ స్కూల్స్ అసోసియేషన్ (ఏఎంఆర్‌ఎస్‌ఏ) ఆధ్వర్యంలో పదవ తరగతి టాపర్స్ విద్యార్థులకు అవార్డులతో పాటు ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, కార్యదర్శి రవి, సలహాదారు రవికుమార్, ఉపాధ్యక్షుడు నిరంజన్, కోశాధికారి శోభారెడ్డి, కార్పొరేటర్లు అమృత, పద్మావెంకట్ రెడ్డి, ప్రైవేట్ పాఠశాలల ఫీజు నియంత్రణ కమిటీ అధ్యక్షుడు బి.దీపక్ కుమార్ పాల్గొన్నారు.