గజ్వేల్, ఫిబ్రవరి 4 : విద్యార్థులు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి పాఠశాల ఉపాధ్యాయుడు బోర్ తవ్వించి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చేశాడు. గజ్వేల్ పట్టణంలోని బాలుర ఎడ్యుకేషన్ హబ్ లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తాగునీటికి విద్యార్థులు ఇబ్బంది పడడం పాఠశాల డ్రాయింగ్ టీచ ర్ పాలమాకుల ప్రవీణ్ కుమార్ ను బాధించింది.
విద్యార్థులు తాగునీటి కోసం పడుతున్న ఇబ్బం దిని గుర్తించి తన సొంత డబ్బులతో బోర్ బోరుబావి తవ్వించ డంతో పాటు మోటార్ బిగించి వాటర్ ట్యాంక్ ను ఏర్పాటు చేశారు.
విద్యార్థుల సమస్యకు స్పందించి సొంత నిధులతో సమస్యను పరిష్కరించినందుకు ఉపాధ్యా యుడు ప్రవీణ్ కుమార్‌ను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డి, ఉపా ధ్యాయులు, సిబ్బంది అభినందించారు. ఈ నీటి సౌకర్యాన్ని ఈనెల 5వ తేదీన ప్రారం భించి విని యోగంలోకి తీసుకు రానున్నట్లు ప్రధానో పాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.