calender_icon.png 14 January, 2025 | 5:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహా కుంభమేళాలో తాండవం షురూ

14-01-2025 01:03:31 AM

బాలకృష్ణ, బోయపాటి శ్రీను నాలుగో కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ 2: తాండవం’ వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘అఖండ’కు సీక్వెల్‌గా రూపొందుతోందీ సినిమా. ఎం తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు.

ఈ మూవీ కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాలో సోమవారం ప్రారంభమైంది. అత్యంత కీలకమైన సన్నివేశాలను మహా కుంభమేళాలో చిత్రీకరిస్తోంది మూవీ యూనిట్.  దసరా కానుకగా 2025, సెప్టెంబర్ 25న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు సంగీతం: థమన్; సినిమాటోగ్రఫీ: సీ రాంప్రసాద్.