- అభివృద్ధి చేస్తలేరనే నైతిక హక్కు వారికి లేదు
- రేషన్ కార్డులు ఇవ్వకుండా 10 సంవత్సరాలు నిర్లక్ష్యం
- ఈనెల 28 నుంచి రైతు భరోసా అందిస్తాం
- రాష్ర్ట ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు
ముత్తారం, జనవరరి 5: పదేళ్లు రాష్ట్రాన్ని ఏలిన బీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని, మా కాంగ్రె స్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము ప్రజ లకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకో వాలని త్రాపత్రంతో ముందుకు నడుస్తున్నమని రా ష్ర్ట ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అ న్నారు.
ముత్తారం మండలంలోని మైదం బండ లో ఆదివారం విలేకరుల సమావే శంలో మాట్లాడుతూ మా ప్రధానమైన బా ధ్యత హార్దిక వ్యవస్థను గాడిలో పెట్టడమని, గాడిలో పెడితే తప్ప ఆరు గ్యారెంటీ లతో పాటు ప్రజలకు ఇచ్చిన హామీలను అమల వుతాయన్నారు. ప్రజలు 10 సంవత్సరా లుగా టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేస్తుందని వేచి చూశారని, కాని అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు అందియలేక పోయా రని అన్నారు.
ఆర్దిక వ్యవస్థను గాడిలో పెట్టి 6 గ్యారంటీలు అమలు పరిచేందుకే ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రయత్నం చేస్తున్నారన్నారు. కొంచెం ఆలస్యం అయినా కానీ తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అన్నిటిని నిలబెట్టుకొని ప్రజల ముందుకు పోతామని అన్నారు.
మా రైతు సోదరులకు సంబంధించి యావత్ రాష్ర్టంలోని రైతాంగ సోదరులకు రూ. 21 వేల కోట్ల రూపాయ లు, రెండు లక్షల రూపాయల వరకు రుణ మాఫీ చేయడం, దానికి తోడు నిన్న క్యాబి నెట్ సమావేశంలో ముఖ్యమంత్రి సహచర మంత్రి వర్గం అందరూ కూడా రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం కూడా ఏర్పాటు జరుగుతు న్నాయని అన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ, బిజెపి పార్టీ వాళ్లు రైతు భరోసా ఇవ్వరు అని అసత్య ప్రచారం చేయడం సరికాదన్నారు.
హామీ మేరకు కూలీలకు సాయం
6 గ్యారంటీలలో భాగంగా భూమిలేని కూలీలకు సంవత్సరానికి రూ.12వేలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా మొదటి దఫాలో రూ.6వేలు ఈ నెలలో ఇవ్వబోతున్నామ న్నారు. బీఆర్ఎస్ ప్రభు త్వం రైతు పెట్టుబడి సాయం కింద రూ.౧౦వేలు ఇస్తే, తమ ప్రభుత్వంలో ఎకరాకు రూ.12 వేలు ఇస్తున్నామన్నారు.
సాగులో యోగ్యత ఉన్న ప్రతి రైతు కుటుంబాలకు రైతు భరోసా ఎకరాకు 12 వేల రూపాయలు అందించే దిశలో ప్రయ త్నం జరుగుతుందని, అదేవిధంగా రైతులకు సన్నబడ్లకు రూ. 500 రూపాయల బోనస్ కల్పించి, రైతులను రాజులు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేస్తుంద న్నారు. రైతు భరోసా ఈనెల 28వ తేదీ నుంచి మొదలు కాబోతుందన్నారు.
రైతుకు సంబంధించి ఏ విషయంలో కూడా రాజీ పడకుండా మా ప్రభుత్వం పనిచే స్తుందన్నారు. అదేవిధంగా రేషన్ కార్డులు ఇవ్వకుండా 10 సంవత్సరాలు నిర్లక్ష్యం వహించిన గత ప్రభుత్వాలు ఈరోజు మా ప్రభుత్వం ఏర్పాటుతో పది సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న రేషన్ కార్డులను కూడా ఇవ్వబోతున్నామన్నారు.
పది సంవ త్సరాల క్రితం పెళ్లిళ్లు అయినా యువకులకు రేషన్ కార్డు లేక చాలా ఇబ్బందులు పడ్డా రని, అది పరిగణలకు తీసుకొని మా కాంగ్రె స్ ప్రభుత్వంలో రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు.
ఇందిరమ్మ ఇళ్లకు సంబం ధించి మేము ఒక కార్యక్రమానికి నాంది పలుకుతున్నామని, ఇవన్నీ కూడా ఒక సంవ త్సర కాలంలోనే పనిచేస్తూ ఉంటే బీఆర్ఎస్, బిజెపి పార్టీకి సంబంధించిన వారు ప్రజ లను తప్పుదోవ పట్టిస్తున్నారని, గత పది సంవత్సరాలుగా అభివృద్ధి చేయలేని ప్రభు త్వాలు, ఒక్క సంవత్సరంలోనే చేస్తలేరని అనడానికి వారికి నైతిక హక్కు లేదన్నారు. మంత్రి వెంట కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.