calender_icon.png 23 April, 2025 | 1:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరదా కాస్తా విషాదం...

22-04-2025 11:06:12 PM

చేర్యాల: సరదా కోసం ఈతకెళ్ళిన వ్యక్తి శవంగా మారిన సంఘటన మండల కేంద్రమైన కొమురవెల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన గొల్లపెల్లి కనకయ్య (50) బతుకుతెరువు కోసం హైదరాబాదు వలస పోయాడు. అక్కడే సీసాల వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో కనకయ్య కుమారునికి కొడుకు జన్మించాడు. మనుమని జన్మదిన వేడుకలను సొంత గ్రామంలో నిర్వహించడంతో కొమురవెల్లికి కుటుంబ సభ్యులతో వచ్చాడు.

ఈ క్రమంలో సరదా కోసం బంధువులతో కలిసి ఈత కొట్టడానికి స్థానికంగా ఉన్న పెద్దబావిలో దూకాడు. దూకిన అతడు పైకి తేలకపోవడంతో అనుమానము వచ్చి వారు కుటుంబ సభ్యులకు తెలిపారు. బంధువులు కలిసి బావిలో తాళ్లతో బావిలోకి దిగి వెతకడంతో బావిలో ఉన్న తాళ్ళకు తట్టి ఉన్నాడు. దీంతో తాళ్ళను కట్టి పైకి తీసుకొచ్చారు. అప్పటికే ఆయన మృతి చెందాడు. ఈ మేరకు కొమురవెల్లి పోలీస్ లు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం కోసం చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.