13-03-2025 01:13:05 AM
రుషి కిరణ్, శ్వేత, రూప, శివ యాదవ్, రజిత, ఏకెఎన్ ప్రసా ద్, మృణాల్ కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘ది సస్పెక్ట్’. ఈ చిత్రాన్ని టెం పుల్ టౌన్ టాకీస్ సమర్పణలో ప్రొడ్యూసర్ కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా దర్శకుడు రాధాకృష్ణ ఈ చి త్రాన్ని రూపొందించారు. ఈ సినిమా ఈ నెల 21న ఎస్‌కేఎమ్‌ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా ఆంధ్ర, తెలంగాణలో విడుదల కానుంది.
ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ప్రముఖ దర్శకుడు వీఎన్ ఆదిత్య ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ పద్మినీ నాగులపల్లి మాట్లాడుతూ.. ‘ది సస్పెక్ట్’ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. ఈ మూవీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా. దర్శకుడు రాధాకృష్ణ ఎంతో ప్యాషన్ తో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది” అన్నారు.
దర్శకుడు వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. “పెద్ద సినిమాలు జీరో కలెక్షన్స్ చేసినవి ఉన్నాయి. చిన్న చిత్రాలు అద్భుతంగా ఆదరణ పొందినవీ ఉన్నాయి. ది స స్పెక్ట్ సినిమా చిన్న చిత్రాల్లో పెద్ద విజయం సాధించాలి” అన్నారు. నిర్మాత కిర ణ్ కుమార్ మాట్లాడుతూ..- “సినిమా రంగంలోకి రావాలనేది నా కల.
అది ఈ సినిమాతో నెరవేరింది. నా స్నేహితుడు వీఎన్ ఆదిత్య మా మూవీ ఈవెంట్‌కు రావడం ట్రైలర్ రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది” అని తెలిపారు. ని ర్మాత లయన్ సాయివెంకట్ మాట్లాడుతూ.. “మూవీ ట్రైలర్ చాలా బా గుంది.
ఈ సిని మా కిరణ్ గారికి మంచి పేరు డబ్బు తీసుకురావాలని కోరుకుంటున్నా” అన్నారు. డైరెక్టర్ రాధాకృష్ణ మాట్లాడుతూ.. “మేము ఈ సినిమాను అం దరికీ నచ్చేలా మంచి సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్‌గా రూపొందించాం. ఒక అమ్మాయి హత్యకు కారకులైన వారిని పట్టుకునే క్రమంలో సాగే చిత్రమిది” అన్నారు.