* నా పిల్లలకు పెద్ద బాలశిక్ష చదివిస్తున్నా
* ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
* తెలుగులో తీర్పు రాయడం ఆనందంగా ఉంది: జస్టిస్ కే మన్మథరావు
హైదరాబాద్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): తల్లిదండ్రుల చొరవతోనే మాతృభాష మనుగడ సాధ్యపడుతుందని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. అనుకరించడం ద్వారా పిల్లలను భాషను నేర్చుకుంటారని.. మాతృభాషతో మమేకమైతే తెలివితేటలు పెరుగుతాయన్నారు. విజయవాడలో జరుగుతున్న ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో ఆదివారం ఆయన మాట్లాడారు. తన మాతృభాష మరాఠీ అయినా.. తెలుగులో చదువుకున్నట్టు తెలిపారు.
తన పిల్లలకు పెద్ద బాలశిక్ష చదివిస్తున్నా న్నారు. మాతృభాష నేర్చుకున్న పిల్లల్లో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుందన్నారు. మైసూర్‌లో ఉ న్న తెలుగు భాష అధ్యయన కేంద్రాన్ని 2020లో ఏపీకి తీసుకొచ్చిన వైసీపీ ప్రభుత్వం.. భవన కేటాయింపునకు మాత్రం చొరవ చూపలేదన్నారు.
అధ్యయన కేంద్రానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, త్వరలోనే సొంత భవనం అందుబాటులోకి వస్తుందన్నారు. గత ఐదేళ్లు తెలుగులో విద్యాబోధనపై నిర్లక్ష్యం వహిస్తూ ఆంగ్ల బోధనపై మక్కువ పెంచే ప్రయత్నం చేశారని విమర్శించా రు.
అనంతరం ఎమ్మెల్సీ అశోక్‌బాబు మాట్లాడు తూ.. రాజకీయ వ్యవస్థ తలచుకుంటే తెలుగు భా ష అభివృద్ధి చెందుతుందన్నారు. తెలుగు భాష వి షయంలో గత ప్రభుత్వం చేసిన తప్పులను కూట మి ప్రభుత్వం సరిచేస్తోందన్నారు. ఎన్ని ప్రయత్రాలు చేస్తున్నా ప్రభుత్వం ఆంగ్లంలో ఉన్న జీవోలను తెలుగులో ఇవ్వలేకపోతోందన్నారు.
అమ్మభాషను కాపాడుకుందాం: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే మన్మథరావు
తెలుగు భాష అమలులో లోపాలను సరిదిద్దుకొని ముందుకెళ్దామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే మన్మథరావు అన్నారు. అమ్మభాషను మాట్లాడదాం.. ఆత్మాభిమానాన్ని చాటుకుందామని ఆయన పిలుపునిచ్చారు. మహాసభల్లో భా గంగా నిర్వహించిన ‘తెలుగులో న్యాయపాలన’ స దస్సులో ఆయన మాట్లాడుతూ.. తెలుగులో తీర్పులు ఇస్తేనే ప్రజలకు సులువుగా అర్థమవుతుందన్నారు. తెలుగులో తీర్పు రాశాను అనే వి షయంలో తనకు ఆనందంగా ఉన్నదన్నారు. ఈ తీర్పుల వల్ల అప్పీళ్లకు వెళ్లడం తగ్గుతుందని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు.
ఆ ఇద్దరే నాకు స్ఫూర్తి: జస్టిస్ భీమపాక నగేశ్
డాక్యుమెంట్ మాతృభాషలో ఉన్నా.. కొందరు ఆత్మన్యూనతతో ఆంగ్లంలో చదువుతున్నారని జస్టి స్ భీమపాక నగేశ్ పేర్కొన్నారు. తాము తెలుగు లో తీర్పు ఇస్తే ఆంగ్లంలో అభినందనలు వచ్చాయన్నారు. మాతృభాషలో చదువుకునే హైకోర్టు న్యాయమూర్తుల స్థాయికి ఎదిగామన్నారు. మా తృభాషలో తీర్పు ఇచ్చేందుకు తనకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, జస్టిస్ ఎన్వీ రమణ స్ఫూర్తి అని స్పష్టం చేశారు.
ఆప్షనల్ సబ్జెక్టుగా చేయొద్దు: జస్టిస్ బీ కృష్ణమోహన్
ప్రతి ఒక్కరూ తెలుగు భాష మాధుర్యాన్ని అనుభవించాలని జస్టిస్ బీ కృష్ణమోహన్ అన్నా రు. పిల్లలకు తల్లిదండ్రులు మాతృభాష అందిస్తేనే భవిష్యత్తులో తెలుగు చూడగలం.. వినగలమన్నా రు. పాఠశాలల్లో మాతృభాషను ఆప్షనల్ సబ్జెక్టుగా చేయొద్దన్నారు. పదో తరగతి వరకు తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయాలన్నారు. హైకోర్టులో మాతృభాష ఎక్కువగా అమలు చేయడంపై ఆలోచన చేస్తున్నామన్నారు. కోర్టుల్లో అను వాదకుల పోస్టులను మళ్లీ తీసుకు రావాలన్నారు.
హైకోర్టు వ్యవహారాలు తెలుగులోనే ఉండాలి: జస్టిస్ కే లక్ష్మణ్
హైకోర్టు వ్యవహారాలు తెలుగులోనే ఉండాలనే దానిపై చర్చ జరగాలని జస్టిస్ కే లక్ష్మణ్ అన్నారు. తెలుగులో వాదనలు వినిపించేందుకు హైకోర్టులో నిషేధం లేదని తెలిపారు. తెలంగాణ హైకోర్టులో 1,100, ఏపీ హైకోర్టులో 547 తీర్పులను అనువదించామన్నారు. కోర్టులో విచారణ తీరును కక్షిదారుడికి తెలియజేయాలన్నారు.
ఇతర భాషల్లో బోధన దుర్మార్గం : జేడీ లక్ష్మీనారాయణ
పిల్లలకు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో బోధన చేయడం దుర్మార్గమని విశ్రాంత పోలీసు అధికారి జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. సహజ సిద్ధంగా వచ్చేదే మాతృభాష అని.. అమ్మ అనే మాటలో ఉన్న మాధర్యుం మమ్మీ అనే మాటలో ఉండదన్నారు. కృత్రిమ భాషతో పిల్లలకు బోధించడం వారి వ్యక్తిత్వాన్ని హరించడమే అవుతుందన్నారు.
భాషాభివృద్ధిలో రాజకీయ నాయకుల పాత్ర చాలా ముఖ్యమైనదని గుర్తు చేశారు. పదో తరగతి వరకు తెలుగు తప్పనిసరిగా ఉండేలా ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలన్నారు. మాతృభాషను నేర్చుకుంటే ఇతర భాషల్లో సులభంగా ప్రావీణ్యం పొందవచ్చన్నారు.