calender_icon.png 4 December, 2024 | 1:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందరి సహకారంతో సర్వే పూర్తి

03-12-2024 07:53:10 PM

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్...

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే ప్రక్రియ 97.22% పూర్తి అయినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. సర్వేలో సేకరించిన సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతుందని తప్పులు లేకుండా సర్వే వివరాలు ఆన్లైన్ చేయాలని అధికారులకు సూచించారు. అంతకుముందు ప్రభుత్వం ద్వారా నిర్వహించి సీఎం క్రీడా పోటీల నిర్వహణపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఈ పోటీలను విజయవంత చేయాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ జిల్లా అధికారులు జీవరత్నం, విజయలక్ష్మి, రామారావు, శ్రీనివాస్, గోవింద్, నరసింహారెడ్డి, శ్రీనివాస్, మోహన్ సింగ్, రాశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.