calender_icon.png 15 November, 2024 | 9:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్వేను ఐదు రోజులు పొడిగించాలి

14-11-2024 01:16:15 AM

హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి): ప్రభుత్వం ఇచ్చిన గడువులోపు ఉపాధ్యాయులు కుల గణన సర్వేను పూర్తి చేయడం కష్టతరమని, సర్వేను మరో ఐదు రోజులు పొడిగించాలని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పింగళి శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి పుల్గం దామోదర్‌రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. అలాగే శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉపాధ్యాయులకు సర్వే విధు ల్లో మినహాయింపు ఇవ్వాలని, అత్యవసర పనులు, అనారోగ్యంతో బాధపడేవారు ఉదయం సెలవు పెట్టుకునేందుకు అవకాశం కల్పించాలని ప్రభు త్వాన్ని విజ్ఞప్తి చేశారు.