calender_icon.png 16 January, 2025 | 3:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారదర్శకంగా సర్వే పూర్తి చేయాలి

16-01-2025 12:58:02 AM

కలెక్టర్ పమేలా సత్పతి 

కరీంనగర్, జనవరి15(విజయక్రాంతి): రాష్ర్ట ప్రభుత్వం జనవరి 26 నుండి అమలు చేయనున్న 4 సంక్షేమ పథకాల క్షేత్ర స్థాయి సర్వే ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేయాల ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశిం చారు. బుధవారం నాడు కలెక్టర్ పమేలా సత్పతి జిల్లా ఉన్నత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, క్రొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రభుత్వం విధి విధానాలు జారీచేసిందన్నారు.

పథకాల అమలుపై అధికారులకు స్పష్టమైన అవగా హన ఉండాలన్నారు. లబ్ధిదారుల ఎంపిక అనేది నిరంతర ప్రక్రియ అని, దీనిపై ఎవ రూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు పథకాల లబ్ది పొందే లా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. రైతు భరోసా క్రింద ప్రభుత్వం వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎకరా కు సంవత్సరానికి 12 వేలు ఇవ్వనుందని కలెక్టర్ అన్నారు.

అధికారులు క్షేత్ర స్థాయిలో వ్యవసాయ యోగ్యం కాని భూములను గుర్తించాలన్నారు.  ఆర్‌ఐ, ఏఇఓలు క్షేత్ర తని ఖీలు చేసి, వ్యవసాయ యోగ్యం, వ్యవసా య యోగ్యం కాని భూముల గుర్తింపు చే యాలన్నారు. నివేదికలకు ఒక ఫార్మాట్ రూపొందించి, క్షేత్ర అధికారులకు అందజే యాలన్నారు. నేటి నుండి (గురువారం) నుండి సర్వే ప్రారంభించి, ఈ నెల20లోగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు.

ఈ నెల 21 నుండి గ్రామ సభల /మున్సిపల్ వార్డ్ లలో సభల నిర్వహణకు కార్యాచరణ చేయాలన్నారు. గ్రామ సభల్లో గ్రామ కార్య దర్శి తోపాటు, సంబంధిత శాఖ అధికారు లు తప్పనిసరిగా పాల్గొనాలన్నారు. గ్రామ సభ నిర్వహణకు విధి విధానాలు ఖచ్చి తంగా పాటించాలని, వీడియోగ్రఫీ చేయా లని కలెక్టర్ అన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించి సంవత్స రానికి 12 వేలు, రెండు విడతలుగా లబ్ధి దారులకు ప్రభుత్వం అందజేస్తుందన్నారు. 

ఉపాధిహామీ జాబ్ కార్డు ఉండి, భూమిలేక, గత సంవత్సరం కనీసం 20 రోజులు ఉపాధి హామీ పనులు చేసిన వారికి ఆత్మీయ భరోసా పథకానికి అర్హులన్నారు. లబ్ధిదారు లకు జాబ్ కార్డ్‌లో భూమి వుండకూడద న్నారు. పథక సర్వే ఈ నెల 18లోగా పూర్తి చేసి, 20న చేపట్టే గ్రామ సభల్లో ప్రజల ముందు ఉంచాలన్నారు. క్రొత్త రేషన్ కార్డుల జారీకి మండల స్థాయిలో  ఎంపిడివో లు, మునిసిపల్ కమీషనర్ లు, జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్, జిల్లా పౌరసరఫరాల అధికారి ధవీకరణ బాధ్యత ఉంటుందన్నా రు.

ప్రభుత్వం నుండి జారీచేసిన ఫార్మాట్ లో సర్వే నివేదిక సమర్పించాలన్నారు. ప్రభు త్వం మార్గదర్శకాల మేరకు అర్హుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ప్రతి దశలో ప్రభుత్వ మార్గదర్శకాలు తూ. చ. తప్పకుం డా పాటించాలన్నారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మి కిరణ్, ఆర్డీఓలు మహేశ్వర్, రమేష్, మున్సి పల్ రెవిన్యూ అధికారులు, ఎంపీడిఓలు తదితరులు పాల్గొన్నారు