నిజమైన అర్హులకు పథకాలు చేరేలా చూడండి
జిల్లా అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్...
బూర్గంపాడు (విజయక్రాంతి): ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన ఖచ్చితమైన ప్రణాళిక ప్రకారం పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్(District Additional Collector D Venugopal) అన్నారు. శుక్రవారం బూర్గంపాడు మండలం సోంపల్లి, లక్ష్మీపురం గ్రామాల్లో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన రేషన్ కార్డుల మంజూరు, ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రక్రియను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా, ఇందిరమ్మ నూతన రేషన్ కార్డుల మంజూరు, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు పథకాలను ప్రతిష్టాత్మకంగా అసలు చేసేందుకు నిర్ణయించిందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాల అమలుకు సంబందించి ప్రణాళిక ప్రకారం ప్రత్యేక బృందాల సర్వేలు పగడ్బందీగా నిర్వహించాలని సూచించారు.
క్షేత్రస్థాయిలో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పధకాలను ప్రజలకు పారదర్శకంగా అందించేందుకు జిల్లా యంత్రాంగం ఆహర్షిశ్రలు కృషి చేయాలని సంబంధిత అధికారులకు అదనపు కలెక్టర్ సూచించారు. పథకాల అమల కోసం ఈనెల 21 నుంచి 24 వరకు గ్రామ సభలు నిర్వహించి, డేటా ఎంట్రీ ఈ నెల 21 నుంచి 25 వరకు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. అర్హులైన లబ్ధిదారుల జాబితాను రూపొందించడంలో క్షేత్రస్థాయి అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. ప్రజా సంక్షేమ పథకాల అమలు ద్వారా జిల్లాలోని అర్హులైన ప్రతి లబ్దిదారుడికి పథకాల ఫలాలు అందేలా అధికారులు కృషి చేయాలని తెలిపారు. రేషన్ కార్డుల కొరకు వచ్చిన దరఖాస్తుదారులు పూర్తి వివరాలను నమోదు చేయాలని, నూతన కార్డుల కొరకు అర్హత గల వారి జాబితాను రూపొందించాలని తెలిపారు. భూమిలేని నిరుపేదలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కనీసం 20 రోజుల పాటు పనిదినాలు ఉన్న వారి వివరాలతో అర్హుల జాబితా రూపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వర్ రెడ్డి, తహశీల్దార్ ముజాహిద్, ఎంపీడీవో జమలారెడ్డి, ఏవో శంకర్, ఆర్ఐ నరసింహారావు, ఏఈఓ నాగ వైష్ణవి, పంచాయతీ సెక్రటరీలు బాలయ్య, వెంకటేష్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.