calender_icon.png 23 December, 2024 | 10:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల సర్వే వేగంగా పూర్తి చేయాలి

23-12-2024 07:14:46 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇళ్ల సర్వేలు వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఒక లక్ష 92,000 దరఖాస్తులు వచ్చాయని మండలాల వారిగా లబ్ధిదారుల ఎంపికకు గ్రామస్థాయిలో సర్వేను పక్కాగా నిర్వహించాలని తెలిపారు. జనవరి 10 లోపు సర్వేను పూర్తి చేయాలని సాంకేతిక లోపం ఉంటే తమ దృష్టికి తేవాలని పేర్కొన్నారు. సర్వేను మండల స్థాయి అధికారులు ప్రతిరోజు పరిశీలన చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్ అధికారులు ఉన్నారు.