calender_icon.png 4 March, 2025 | 5:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధరణిలో సమస్యాత్మక లిస్టులో ఉన్న సర్వే నెంబర్‌ను తొలగించాలి

04-03-2025 01:43:35 AM

నాగర్ కర్నూల్ మార్చ్ 3 విజయక్రాంతి ః నాగర్ కర్నూల్ మండలం తూడుకుర్తి గ్రామంలోని సర్వే 766 ను ధరణిలోని సమస్యాత్మక లిస్టు పార్ట్ బి నుంచి తొలగించి రైతులకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం బీఎస్పీ పార్టీ నేతలు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కార్యాలయం చంద్రశేఖర్ కి వినతి పత్రాన్ని అందించారు. సుమారు 100 ఎకరాలు ధరణిలో పార్ట్ - బిలో ఉంచడంపై రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని బిఎస్పీ జిల్లా ఇంచార్జ్ పృథ్వీరాజ్, అసెంబ్లీ అధ్యక్షులు కళ్యాణ్, బిఎస్పీ తూడుకుర్తి గ్రామ అధ్యక్షులు గౌరీ భాస్కర్ లు ఏవో కు విన్నవించారు.