calender_icon.png 10 January, 2025 | 11:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరిహద్దు ప్రాంతంలో నిఘా వ్యవస్థను పటిష్టం చేసుకోవాలి

11-12-2024 11:45:06 PM

భీంపూర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ...

ఆదిలాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులోని పోలీస్ స్టేషన్లలో నిఘా వ్యవస్థను మరింత పటిష్ట పర్చుకోవాలని జిల్లా ఎస్పీ గౌష్ అలం అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా భీంపూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను బుధవారం జిల్లా ఎస్పీ తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా స్టేషన్ ఆవరణలో పరిశుభ్రత పాటించాలన్నారు. మొక్కను నాటడం జరిగింది. స్టేషన్ సిబ్బంది ద్వారా స్క్వాడ్ డ్రిల్లు ను తీసుకొని వారి కవాతును పరిశీలించారు. రిసెప్షన్ సెంటర్ ను, స్టేషన్ రికార్డులను, పోలీస్ స్టేషన్ నిర్వహణ, ఫైల్ ల నిర్వహణ, సిబ్బంది విధులు, వర్టికల్స్ అనుసరిస్తున్న విధానాన్ని పరిశీలించారు. స్టేషన్ లో నమోదైన ప్రతి ఒక్క కేసు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల గౌరవంగా వ్యవహరించాలన్నారు. భీంపూర్ పోలీస్ స్టేషన్ మహారాష్ట్ర సరిహద్దుతో ఉన్నందున ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించకుండా పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐ సాయినాథ్ ఎస్ఐ పురుషోత్తం, ఖలీమ్ ఉన్నారు.