17-04-2025 12:00:00 AM
ఎన్నికల్లో గెలిచిన ప్రతినిధులు మాత్రమే రాజ్యాంగ సభలో ఉంటారు. అంబేడ్కర్ ను బొంబాయి గెలిపించ లేదు. బెంగాల్ నుంచి ముస్లిం లీగ్ మద్దతుతో సభ్యులైనారు. కాని, దేశ విభజనతో ఆయన స్థానం పాకిస్తాన్‌లోకి వెళ్లిపోయింది. బొంబాయి రాష్ర్ట ప్రధానమంత్రి (స్వతం త్రానికి ముందు ఆయా రాజ్యాలకు ప్రధానమంత్రులు ఉండేవారు) బీఎన్ ఖేర్‌కు రాసిన ఒక ఉ త్తరంలో అంబేడ్కర్‌ను బొంబాయి నుంచి గెలిపించాలని డా. బాబూ రాజేంద్ర ప్రసాద్ కోరారు. ఎం.ఆర్.జయకర్‌తో రాజీనామా చేయించి, అంబేద్కర్‌ను గెలిపించుకుని రాజ్యాంగ సభకు ఆయనే పంపించారు.
అంబేద్కర్ ఉన్నత విద్యావంతుడు. అటు ఆర్థికశాస్త్రం, ఇటు న్యాయశాస్త్రం రెంటినీ ఔపోసన పట్టినవారు. పాలనా వ్యవస్థల నిర్మాణం గురించి లోతుగా అధ్యయనం చేసిన వ్యక్తి. కాబట్టే, ఆయన రచనా ఉపసంఘంలో ఉండాలని రాజేంద్రప్రసాద్ సూచించారు. నిజానికి అంబేడ్కర్‌కు ఎప్పుడూ అన్నదే పరాజయం లేదు. ప్రతిసారీ గెలుస్తూనే ఉన్నారు.
ఈనాటి కాలానికి, ఈ తరానికి, ఇప్పటి యుగానికి మన రాజ్యాంగం నిల బడింది. ఆయన ఒక్కో అధికరణాన్ని మార్చడానికి ఆలోచిస్తూ ఉంటే చెడగొట్టడానికి చాలామంది ప్రయత్నాలు సాగించారు. చివరకు ఆయనే రా జ్యాంగ నిర్మాణ బాధ్యతను పూర్తి చేయగలిగారు. భారతీయ చరిత్రలో ఇదొక మహా ఘనవిజయం.
ప్రతి వాక్యానికీ వాద ప్రతివాదాలు
ఒక్కో ఆర్టికల్‌లో ప్రతి అక్షరమూ అవసరమే అని చెప్పడానికి సాక్ష్యాధారాలతో సభలో వాదించవలసి వచ్చింది. అంబేద్కర్ దాదాపు 60 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసారు. తొలి డ్రాఫ్ట్ (చిత్తుప్రతి) రూపొందించిన బీఎన్ రావ్ కూడా ఎ న్నో వివరాలు చెప్పారు. చివరకు రాజ్యాంగానికి తుదిరూపు ఇచ్చిన ముఖ్య నిర్మాత అంబేద్కర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
కావ్యాన్ని నాటకాన్ని నవలను రాసిన వారిని రచయిత అం టారు. ఒక దేశానికి కొన్ని దశాబ్దాలపాటు విధానాలను ప్రతి పూసలోనూ గ్రుచ్చే దారం వలె అన్ని రకాల విధానాలతో రూపొందిన శాశ్వత పుష్పాలమాల అనగలిగే సమగ్ర పత్రాన్ని రాజ్యాంగం లేదా సంవిధానం అని అభివర్ణించాలి. దానికి ఒక మార్గదర్శిగా నిలబడి రూపొందించిన ప్రక్రియను కేవలం ‘రచన’ అంటే సరిపోదు. రచన అంటే సృ ష్టి. కాని రాజ్యాంగం అనేది సష్టించిన వస్తువు కా దు.
వ్యవస్థ నిర్మాణానికి విశిష్టమైన ప్రక్రియ అది. ప్రపంచంలో ఎక్కడ మంచి ఉందో తెలుసుకుని అక్కడ నుంచి వెతికి పట్టి, మన దేశానికి సరిపోయేట్టుగా ఒక్కో విధానాన్ని నిర్మించడం అనేది రచన కన్నా చాలా క్లిష్టమైన పని అని అర్థం చేసుకోవలసి ఉంది. ఒక్కొక్క పదాన్ని ఎంచుకుని, ఒక్కొక్క వా క్యాన్ని నిర్మించి, అందులో ఎంచుకున్న భాషను, వాడిన పదాలను, అవి ఆ విధంగా ఈ పదాలను ఎందుకు వాడవలసి వచ్చిందో కూడా వివరించవలసి వచ్చింది.
ఒకోసారి అనేకానేక అనుమానాలు వచ్చేవి. మరోసారి సవరణలు, ప్రశ్నల రూపంలో అంబేద్కర్ ముందుకు వచ్చి పడేవి. సభ్యులు ఉద్రేకంగా, ఆవేశంగా, తీవ్ర పదజాలంతో ప్రసంగాలు చేస్తూ ఉంటే ప్రతి దానికీ సమాధానం చెప్పవలసిందే కదా. చివరకు ఒక గొప్ప రాజ్యాంగాన్ని నిర్మించే అవకాశం వచ్చింది. అటువంటి పటిష్ఠమైన సంవిధానాన్ని, వద్దన్న వారు, నిరాకరించిన వారూ, అంగీకరించిన వారూ ఉన్నారు. మొత్తం మీద విడివిడిగా మన ముందు మార్చిన వాక్యాలతో ఈ రూపంతో వచ్చిందే భారతీయ రాజ్యాంగం.
ఒక భవనానికి కావలసిన మౌలికమైన ఉక్కు ఫ్రేమ్ లేదా శరీరానికి అస్థి పంజరంతో కూడిన నాడీవ్యవస్థ వంటి బేసిక్ స్ట్రక్చరల్ ఫ్రేమ్‌ను రూపొందించింది అంబేద్కర్. మొత్తం రచనా ఉపసంఘం సమావేశాలన్నింటికీ వచ్చిన ఏకైక వ్యక్తి అంబేద్కర్ మాత్రమే.
ఇ ప్పటి చట్టసభలలో మాట్లాడడం సులువే. వాక్ అవుట్ చేయడం, స్పీకర్ ముందు అరవడం, మైక్ లాగడం వంటివేవీ తెలియని ప్రతినిధులు, రాజ్యాంగ నిర్ణాయక సభ చర్చలను చదివితే, అంబేద్కర్ ఓపికతో జవాబులు ఇచ్చారు. ఇదీ ఆయనలోని గొప్పతనం.
పీఠిక రాసిందెవరు?
కనుక, రాజ్యాంగం నిర్మించిన రచనా ఉపసంఘం అధ్యక్షుడు అంబేద్కర్‌కే పీఠిక నిర్మాణం ఘనత కూడా చెందుతుంది. కాని రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ కన్నా ఎక్కువ శ్రద్ధ చూపిన వారుగానీ, కష్టపడ్డవారు గానీ, మరొకరు ఎవరూ లేరని జవహర్‌లాల్ నెహ్రూ చాలా స్పష్టంగా ప్రకటించారు. మోతీలాల్ నెహ్రూ మొదటి డ్రాఫ్ట్ పీఠికను రూపొందించారు.
మరి గొప్ప రాజనీతివేత్తలుసహా నెహ్రూ ఆలోచనలు, మరింత చర్చ తర్వాత పీఠిక నిర్మాణం జరిగింది. అయితే, అంబేద్కర్ తన చివరి ప్రసంగంలో రాజ్యాంగ నిర్మాణ ఘనత తానొక్కడికే ఇవ్వడం సరికాదని కూడా ప్రకటించారు. డ్రాఫ్టింగ్ కమిటీలో, రాజ్యాంగ సభలో, రాజ్యాంగ రచనలోనూ అనేకమంది కీలక పాత్ర పోషించారని ఆయన అభిప్రాయపడ్డారు.
రాజ్యాంగం ఎందుకంటే?
అంబేద్కర్ లక్ష్యం షెడ్యూల్డ్ కులాలు, తెగలవారి అభ్యున్నతి కోసం రాజ్యాంగ నిర్మాణంలో పోరాడటం ఒక్కటే. ‘భారత ప్రభుత్వ చట్టం 1935’ను విస్తరిస్తూ, ‘మన దేశానికి ఆ విధమైన పాలనా విధానం సరిపోతుందేమో’ అని ఆలోచించే వారూ ఉండేవారు. కానీ, అది సరిపోదు. ‘1935 చట్టాన్ని కొంచెం అటు ఇటూ మార్చగా వచ్చిందే రాజ్యాంగం’ అనికూడా కొందరు వ్యా ఖ్యానించారు.
అక్షరాలు కొన్ని వాటిలోనివి ఉండవచ్చునేమో. కానీ, పాలనా విధానంలో గొప్ప మా ర్పులు జరిగాయి. అంతకు ముందు చిత్తుప్రతిని రూపొందించిన బీఎన్ రావు విదేశాల్లో ఉండి పోవలిసి వచ్చింది. “ఆ రచనా సంఘంలో ఎంతమంది ఉన్నా మొత్తం మీద అయిదుగురు కీలకమై న సభ్యులలో ఒకరిద్దరి పాత్ర లేనే లేదు. మరికొందరి పాత్ర స్వల్పం” అని ఈ రచనా సంఘంలో సభ్యుడైన టీటీ కష్ణమాచారి చెప్పారు.
అయితే, మొత్తం రచనా బాధ్యత ఈ సంఘానికే పరిమితం కాలేదు. కేంద్ర అధికారాల కమిటీకి నెహ్రూ, రా ష్ట్రాల అధికారాల కమిటీ నేతగా వల్లభాయ్ పటేల్, ప్రాథమిక హక్కుల కమిటీకి జేబీ కృపలానీ ఇంకా పలువురు అనేకానేక అంశాలపైన ఉపసంఘాలుగా ఏర్పడి, పనిని పంచుకుని ఆయా నియ మాలకు ఒక సమగ్ర రూపం ఇచ్చారు. అధ్యక్ష హోదాలో ఉన్న అంబేద్కర్ తనదైన పాత్రను ఎంతో హుందాగా నిర్వహించారు. రచనలో కీలకమైన బాధ్యతను స్వీకరించి, ‘రాజ్యాంగ పిత’ అన్న ఖ్యాతిని పొందారు, పదవి కోసమైతే కాదు!
జీవితమంతా దేశానికే అంకితం
మన రాజ్యాంగ గ్రంథాన్ని ఒక దిండు అనుకునే వారిని మనమేమీ చేయలేం. దానిని తల కిం ద పెట్టుకోవడం ద్వారా పీఠికలోని మహదాశయా లు, అందులోని ఒక్క అక్షరం మెదడులోకి వెళ్లదు. దానిని ఆసాంతం చదవడం అవసరం. పార్లమెంట్‌లో నేలమీద సాష్టాంగ పడాల్సిన పనీ లేదు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని ని ర్మించడంలో చేసిన గొప్ప కృషిని ఎవరూ మరువలేరు.
రాజ్యాంగ నిర్మాతగా ఆయన నిర్వర్తించిన బాధ్యతలలో రచనా సంఘంలో అధ్యక్షుడు కావ డం, పీఠిక రచనలో కీలక పాత్ర నిర్వహించడం, ప్రాథమిక హక్కులను సేకరించడం, వాటిని అమ లు చేయడానికి చేసిన గొప్ప పనులు వంటివెన్నో. సమానత్వం, భావ వాక్ స్వాతంత్య్రాలు సాధించడం, వివక్ష నుంచి భారత దేశ పౌరులను రక్షిం చడం, అనేకానేక స్వేచ్ఛలను అమలు చేసుకోవడం వంటివన్నీ ఎంతో ముఖ్యమైనవి.
ఇంతటి విజయా లు సాధించినా, రాజ్యాంగ నిర్మాణం తరువాత కూడా ఆ ‘రూల్ ఆఫ్ లా’ తన ముందే కలలు నిలబడకుండా కనపడుతుంటే ఆయన ఎంతో బాధ పడ్డారు. ఒక నిస్పృహ, నిరాశ, శరవేగవంతమైన అభివృద్ధి సాధ్యం కావడం లేదని మనసులో క్షోభించారు. చివరకు ఆయన ఆరోగ్యం కూడా క్షీణించింది.
అంబేద్కర్ బాల్యం, తరువాత చదువు, కేవలం 65 సంవత్సరాలలో, మొత్తం జీవితమంతా దేశానికే అంకితం చేశారు. ప్రజలలో సామాజిక న్యా యం, విద్య, సమానత్వాల కోసమే పోరాడారు. భారత రాజ్యాంగ రూపకర్తగా, దళితుల హక్కుల కోసం ఆరాటపడ్డారు. అయితే, రాజకీయంగా సా ధికారత లేకపోతే ప్రగతి లేదన్నారు. అంటరానితనం నిర్మూలనకు తీవ్ర ప్రయత్నం చేశారు. ఆయ నది నిజంగానే ఆనాడు వొడిసి పోని ఉద్యమం, ఇంకా ముగించని ఉద్యోగం. అటువంటి మహానుభావుని జీవితకాల కృషి అజరామరం.