07-02-2025 02:12:27 AM
ఆదిలాబాద్ జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
ఆదిలాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో మొన్నటి వరకు చలితో వణికిన జనాలు ఇప్పుడు వేసవి కాలం ఆరంభంలోనే జిల్లాలో ఎండలు మండుతుండటంతో జంకుతున్నారు. ముందుముందు ఎండల తీవ్రత ఎలా ఉంటుందోనని బెంబేలెత్తిపోతున్నారు. మొ వరకు చలి తీవ్రత ఎక్కుకాగా ఉండగా ప్రస్తుతం ఎండలతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పు ఏర్పడింది.
జిల్లాలోని పలు మండలాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. గురువారం ఆదిలాబాద్ జిల్లా కేం పాటు తలమడుగు, భీంపూర్, బేలా మండలాల్లో 37.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఎండ తీవ్రత పెరగడంతో ప్రజలు మధ్యాహ్నం పూట ఇబ్బందులుపడుతున్నారు. బయట తిరిగే వారు ఎండల నుంచి రక్షణగా తలకు, మొహానికి తెల్లటి తువాళ్లు ధరిస్తున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరగనున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.