calender_icon.png 27 April, 2025 | 9:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాస్త తగ్గుముఖం పట్టిన ఎండలు

27-04-2025 12:42:34 AM

2 డిగ్రీల మేర తగ్గిన ఉష్ణోగ్రతలు

హైదరాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): రాష్ట్రంలో శనివారం ఎండలు కాస్త తగ్గుముఖం పట్టా యి. గత రెండు రోజుల పాటు 45 డిగ్రీలను దాటిన ఉష్ణోగ్రతలు శనివారం సుమారు 2 డిగ్రీల మేర తగ్గాయి. అయినా చాలా ప్రాంతా ల్లో వడగాల్పుల ప్రభావం కనిపించింది.

అయితే రాబోయే రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతల్లో మార్పు లు ఉండే అవకాశం కనిపించడం లేదని, కానీ రాష్ట్రంలోని పలు ప్రాం తాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షా లు కురుస్తాయని వాతావరణ కేం ద్రం తెలిపింది.

ఆదివారం పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని, సోమవారం కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గంట కు 50 కి.మీ.ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు మెరుపు లతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ నెల 29, 30 తేదీల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం ఉం టుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.