calender_icon.png 13 March, 2025 | 10:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎండలు పెరుగుతున్నాయి జర జాగ్రత్త

13-03-2025 12:31:05 AM

వైద్యాధికారి డాక్టర్ రవి

మహబూబాబాద్, మార్చి 12(విజయక్రాంతి): వడదెబ్బ లక్షణాలు, ప్రథమ చికి త్సపై  అవగాహనా గురించి మహబూబాబాద్ జిల్లా మరిపెడ వైద్య అధికారి డాక్టర్ రవి ప్రజలు  తీసుకో వలసిన జాగ్రత్తలపై పలు సూచనలు తెలియజేసారు. ఎండలు తీవ్రముగా  ఉన్నప్పుడు మనిషి శరీరములో ఉష్ణోగ్రతను నియంత్రించే కేంద్ర మండల నాడి వ్యవస్థ  దెబ్బ తినడం వలన వడదెబ్బ వస్తుంది.

శరీర ఉష్ణోగ్రత పెరిగి మెదడు మీద ప్రభావం  చూపుతుంది. వడదెబ్బ తగిలిన వారిలో 40% మరణాలు సంభవిస్తాయి. ఇది చాల  ప్రమాదకరమైనది. వేసవి కాలములో సాధారణoగా అపాయానికి గురి చేసేది వడదెబ్బ  దానినే సన్ స్ట్రోక్  లేదా హీట్ స్ట్రోక్ అంటారు. తీవ్ర స్థాయిలో వడదెబ్బ తగిలితే ప్రాణాలు  పోయే ప్రమాదము కూడా ఉంది. కనుక వడ దెబ్బ తగిలిన వ్యక్తికి తక్షణమే వైద్య  సహాయం అందించాలి.

ముఖ్యలక్షణాలు.. తలనొప్పి, తలతిరగడము, నాలిక ఎండి  పోవడము, పిడచ కట్టుకుపోవడము, చెమట పట్టుకుండుట, ఎండి పోయిన చర్మముతో  ఎక్కువ జ్వరం కలిగి ఉండడం, మగత కలవరింతలు, ఫిట్స్, పాక్షిక లేదా పూర్తి అపస్మారక  స్థితి.

ముఖ్య కారణాలు  శరీరంలో ఎక్కువ వేడి ఉత్పతి  కావడం, శరీరం ఎక్కువ ఉష్ణాన్ని  కోల్పోవడము. వడ దెబ్బ తగలాగానే చేయవలసిన పనులు వడదెబ్బ తగిలిన వ్యక్తిని  త్వరగా నీడ గల ప్రదేశానికి చేర్చాలి, అతని శరీరం పై వుండే దుస్తులను తొలగించి  చల్లని నీటితో కడగడము కానీ, చల్లని నీటిలో ముంచిన గుడ్డతో తుడవడము  చేయాలి, ఐస్ ముక్కలను గుడ్డతో ఉంచి శరీరాన్నితుడిచి, చల్లని గాలి తగిలేలా  చూడాలి, రోగస్త్రులకు చల్లని నీరు లేదా ఉప్పు మరియు ఇతర లవణాలు కలిపిన నీటిని  త్రాగించాలి.