calender_icon.png 29 April, 2025 | 11:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎండలు మండుతున్నాయి పిల్లలు జాగ్రత్త..!

29-04-2025 04:59:25 PM

ఓఆర్ఎస్సే దివ్య ఔషధం..

చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ నరేన్.. 

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): ప్రస్తుతం ఎండలు మండుతున్న నేపథ్యంలో చిన్నపిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి, డిహైడ్రేషన్, వడదెబ్బ వంటి సమస్యతో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం పొంచి ఉందని ప్రముఖ చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ నరేన్ తెలిపారు. సుమారు 40 డిగ్రీలు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సందర్భంగా ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఎండలు మండుతున్నాయి. వాటి ప్రభావంతో వేడి గాలులు కూడా వీస్తుండడంతో అప్పుడే పెట్టిన బిడ్డ నుండి సుమారు 12 ఏళ్ల చిన్నారుల్లో డీహైడ్రేషన్ ప్రధాన సమస్యగా ఏర్పడుతుందని ఫలితంగా వాంతులు విరేచనాలు, జలుబు, దగ్గు, తీవ్ర జ్వరం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వైద్యులు హెచ్చరింస్తున్నారు.

ఈ నేపద్యంలో చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ నరేన్ విజయక్రాంతితో పలు సూచనలు సలహాలు పంచుకున్నారు. పిల్లలు ఉన్నవారు పిల్లలను తీసుకుని వివాహ వేడుకలు ఇతర కార్యక్రమాలకు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చాలా ఉత్తమమని సూచిస్తున్నారు. అత్యవసరమైతే ఉదయం 10 లోపు సాయంత్రం 6 తర్వాత బయటికి వెళ్లడం మంచిదని చెప్తున్నారు. ఎండల వేడిమి కారణంగా చిన్నారులు ఉక్కపోతకు గురికాకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తున్నారు. వాంతులు విరేచనాలు అవుతున్న పరిస్థితుల్లో ఇంట్లో ఉన్న ఓఆర్ఎస్ అందించడం ఉత్తమమని ఒకవేళ ఓఆర్ఎస్ లేకపోయినా చిటికెడు ఉప్పు, చక్కెర గోరువెచ్చటి నీటిలో సమపాలల్లో కలిపి తాగిస్తే దివ్య ఔషధంగా పనిచేస్తుందన్నారు. ఒక్క పూత నుండి ఉపశమనం కోసం వదులు తెలుపు రంగు దుస్తులను ధరించడం ఉత్తమన్నారు. అయినా తగ్గని ఎడల దగ్గరలోని చిన్నపిల్లల వైద్యుడి సూచన మేరకు వైద్యం అందించడం మేలు అన్నారు.