calender_icon.png 3 March, 2025 | 10:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నం పెట్టే రైతన్న ఆత్మహత్య బాధాకరం

03-03-2025 01:18:45 AM

రైతు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన 

తెలంగాణ రైతు సంక్షేమ సమితి సభ్యులు

కూసుమంచి, మార్చి 2 (విజయక్రాంతి): అందరికీ అన్నం పెట్టే రైతన్న ఆత్మహత్య సమాజానికి ఏమంత మంచిది కాదు..  రైతు ఆత్మహత్యలు లేని సమాజాన్ని నిర్మించాలి.. రైతును కాపాడుకోవాలనీ తెలంగాణ రైతు సంక్షేమ సమితి సభ్యులు అన్నారు..

ఆదివారం కూసుమంచి మండలం తురకగూడెం గ్రామంలో ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న బుర్ర దర్గయ్య (32) కుటుంబాన్ని మాజీ హైకోర్టు జడ్జి చంద్రకుమార్ ఆధ్వర్యంలోని తెలంగాణ  రైతు సంక్షేమ సమితి సభ్యులు పరామర్శించారు.. దర్గయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వాళ్ల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందించి, చిన్న పిల్లల చదువులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ జడ్జి చంద్ర కుమార్ అందరిలా రిటైర్డ్ అయ్యాక విశ్రాంతి తీసుకోకుండా దేశానికి అన్నం పెట్టే రైతు కోసం పోరాటం సాగిస్తున్నారు.. ఎటువంటి స్వార్థం లేకుండా రైతు మాత్రమే సమాజానికి మేలు చేస్తున్న తాను చేస్తున్న  వ్యవసాయంలో అప్పులయితే ఆత్మహత్య చేసుకొని వారి కుటుంబానికి తీరని వేదనను మిగిలిస్తున్నాడు.

రైతులు ధైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకోవద్దు అన్నారు..  ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ విజన్ స్కూల్ చైర్మన్ కొత్త శ్రీనివాసరావు, జనరల్ సెక్రెటరీ నరసింహ , ఆర్గనైజేషన్ సెక్రటరీ మల్లేష్ , అడిషనల్ సెక్రెటరీ అనంతరెడ్డి , తురక గూడెం మాజీ సర్పంచ్ లింగయ్య ,గ్రామ పెద్దలు బుర్ర వెంకన్న ,బుర్ర (గజ్జ) వెంకన్న , కన్నెబోయిన నరేష్ , బుర్ర గోపి ,బుర్ర భాస్కర్ తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.