calender_icon.png 18 March, 2025 | 5:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీడని ప్రముఖ వ్యాపారి సూసైడ్ మిస్టరీ

17-03-2025 10:50:05 PM

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ చెందిన ప్రముఖ వ్యాపారి కొత్తకొండ శ్రీనివాస్ గత మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. సోమవారం నర్సులబాద్ చెరువుల్లో పడి చనిపోయిన వ్యక్తి బాన్సువాడకు చెందిన కొత్తకొండ శ్రీనివాస్ గా పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాల వల్లే కొత్తకొండ శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. చెరువులో శవమైన వ్యక్తి కొత్తకొండ శ్రీనివాస్ బాన్సువాడ పట్టణంలోని అపెక్స్ టైలరి యజమానిగా గుర్తించారు. గత మూడు రోజుల నుంచి కనిపించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొత్తకొండ శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

ఎలాంటి అప్పులు లేవని అతడు చావల్సిన అవసరం లేదని మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు. బాన్సువాడలో ప్రముఖ వ్యాపారిగా గుర్తింపు పొందిన కొత్తకొండ శ్రీనివాస్ మృతి చెందడం బాన్సువాడలో విషాదం నెలకొంది. మూడు రోజులకు శవం లభించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు. ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని ఎందుకు నస్రుల్లాబాద్ చెరువులో శవమై తేలడంపై పలు అనుమానాలు వ్యక్తం కావడంతో పాటు హత్యనా ఆత్మహత్యనా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.