calender_icon.png 20 February, 2025 | 5:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీఓ 81 ప్రకారం 61 ఏండ్ల పైబడిన వీఆర్‌ఎ వారసులకు ఉద్యోగాలివ్వాలి...

17-02-2025 11:39:41 PM

70 వేల ఉద్యోలిచ్చారు.. మిగతా 3, 797 మందికి ఇవ్వాలి..

నెలలుగా కాలయాపన చేస్తున్న ప్రభుత్వం..

వద్ద వీఆర్‌ఎ వారసుల జేఏసీ ధర్నా...

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య.. 

ముషీరాబాద్ (విజయక్రాంతి): వీఆర్‌ఎ వారసులకు ఉద్యోగాలివ్వాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో వీఆర్‌ఎ వారసుల జేఏసీ, నిరుద్యోగ జేఏసీ సంయుక్త ఆధ్వర్యంలో జీఓ నెంబర్ 81 ప్రకారం 61 సంవత్సరాల పై బడిన వీఆర్‌ఎల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పెద్తెత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ... గత ప్రభుత్వం 2020 సెస్టెంబర్ 9న అసెబ్లీలో బీఆర్‌ఎలకు పే స్కేల్, వారసులకు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిందని, ఆ హామీలను అమలు చేయాలని వీఆర్‌ఎలు రాష్ట్ర వ్యాప్తంగా 80 రోజుల పాటు దీర్ఘకాలిక సమ్మె పోరాటం ఫలాతంగా గత ముఖ్యమంత్రి రెవెన్యూ అధికారుల సమక్షంలో వీఆర్‌ఎ జేఏసీతో చర్యలు జరిపి జీఓ నెంబర్  81. 85లను విడుదల చేసిందన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 20.555 మంది వీఆర్‌ర్వోల్లో డిగ్రీ చదివిన వారిని జూనియర్ అసిస్టెంట్‌లు, ఇంటర్ చదివిన వారిని రికార్డు అసిస్టెంట్‌లు, పదవ తరగతిలోపు వారిని ఆఫీస్ సబార్డినేట్స్, రెవెన్యూ శాఖతో పాటు, మున్సిపల్, ఇరిగేషన్, మిషన్ భగీరథ, విద్యా, వైద్య తదితర శాఖల్లో ఉన్న ఖాళీల్లో 16. 758 మంది వీఆర్‌ఎలను ప్రభుత్వం సర్ధుబాటు చేసిందని తెలిపారు. మిగతా 3.797 మంది వీఆర్‌ఎ వారసులకు ఉద్యోగ ఉత్తర్వులు ఇవ్వకుండా గత 15 నెలలుగా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఆయన మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికి 70 వేల ఉద్యోగాలిచ్చారని, ఇవి కేవలం 3, 797 మందికి ఇవ్వడం కష్టం కాదన్నారు. వీఆర్‌ఎ వారసులు కూడా నిరుద్యోగులే కదా అని అన్నారు.

వీరికి ఉద్యోగాలు ఇవ్వడం వల్ల కొంత నిరుద్యోగం తుగ్గుతుందని అన్నారు. వయస్సు పైబడి అనారోగ్యాల బారిన పడుతున్నారని, తండ్రుల స్థానంలో వారి వరసులు వీఆర్‌ర్వోలుగా కొనసాగుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్ ముదిరాజ్, వీఆర్‌ఎ వారసుల జేఏసీ అధ్యక్షుడు ఆంజనేయులు, బీసీ సంఘం నాయకులు, వీఆర్‌ఎ వారసుల జేఏసీ నాయకులు జిల్లపెల్లి అంజీ, వేముల రామకృష్ణ, అనంతయ్య, రాజశేఖర్, రాజేందర్, అనిల్, మోడీ రాందేవ్, గంగములు, పగిళ్ల సతీష్, రామ్‌సాగర్, హరీష్, శ్రీను, మహబూబ్, చందు, రజినీకాంత్, ఇబ్రహం, హనుమానుల, కదీర్, స్వామి, రవి యాదవ్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.