calender_icon.png 16 November, 2024 | 1:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీఆర్‌ఏ వారసులకు ఉద్యోగాలివ్వాలి

16-11-2024 12:15:27 AM

ఎమ్మెల్సీ కోదండరామ్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 15 (విజయక్రాంతి): 16 నెలలుగా పెండింగ్‌లో ఉన్న వీఆర్‌ఏ వారసుల ఉద్యోగాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని ఎమ్మెల్సీ ప్రొ.కోదండరామ్ ప్రభుత్వాన్ని కోరారు. జీవో నంబర్ 81లో మిగిలిన 3,797 మంది వీఆర్‌ఏ (వారసులకు) లకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వీఆర్‌ఏ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ వంగూరు రాము లు అధ్యక్షతన బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం రాష్ట్ర సదస్సు నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ, ప్రొ.కోదండరామ్, ప్రొ.హరగోపాల్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్. కృష్ణయ్య, తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి, తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్ తదితరులు హాజరై ప్రసంగించారు. కోదండరామ్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 3,797 వీఆర్‌ఏల వారసులు ఉద్యోగాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రన్నారు.

కాంగ్రెస్ ఆధ్వర్యంలోని నూతన రెవెన్యూ వ్యవస్థలో వీఆర్‌ఏ వారసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన కోరారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి నిర్ధిష్టమైన రిపోర్టు ఇవ్వనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, పూర్వ వీఆర్‌ఏ జేఏసీ కన్వీనర్ రమేష్ బహదూర్, పాలమూరు అధ్యయన కమిటీ అధ్యక్షుడు రాఘవాచారి, వివిధ జిల్లాలకు చెందిన నాయకులు తదితరులు పాల్గొన్నారు.