calender_icon.png 31 October, 2024 | 11:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీట మునిగిన ‘కిమ్’ దేశం

02-08-2024 01:36:47 AM

వరద బాధితులను ఆదుకుంటామని దక్షిణ కొరియా ప్రకటన

ఆఫర్‌పై  స్పందించని ఉత్తర కొరియా

పోంగ్యాంగ్, ఆగస్టు 1: ఉత్తర కొరియాకు దక్షిణ కొరియాకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా దయాది పోరు నడుస్తోంది. ఏ క్షణంలోనైనా రెండు దేశాలు పరస్పరం అణుబాంబులు వేసుకుంటాయని యావత్ ప్రపంచం భావించింది. కానీ కుంభవృష్టి సంభవించి ఉత్తర కొరియా అతలాకుతలం అయి, వేలాది మంది నిరాశ్రయులవుతున్న వేళ దాయాది దేశం దక్షిణ కొరియా మంచి ఆఫర్ ప్రకటించింది. వరద బాధితులను ఆదుకునేందుకు తాము సిద్ధమని ప్రకటించింది. ఎలాంటి సాయం అందించేందుకైనా సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. దీనిపై ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. దక్షిణ కొరియా కొవిడ్ సంక్షోభ సమయంలోనూ ఉత్తర కొరియాకు ఇలాంటి ఆఫరే ఇచ్చింది. అప్పుడు కూడా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ స్పందించ లేదు.

స్వయంగా బోటు నడిపిన కిమ్..

భారీ వర్షాల కారణంగా ఉత్తర కొరియా  అతలాకుతలమవుతున్నది. ఇప్పటికే దేశంలోని ప్రధాన పట్టణాలైన సినాయ్జూ, యిజును వరదలు ముంచెత్తాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 4,100 ఇల్లు నీట మునిగాయి.