calender_icon.png 24 December, 2024 | 6:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హాస్టల్ పైనుంచి దూకిన విద్యార్థిని

11-07-2024 12:22:25 AM

ఇంటికి తీసుకెళ్లడం లేదని మనస్తాపం చెందిన చిన్నారి

నస్పూర్ (మంచిర్యాల), జూలై 10 (విజయక్రాంతి): హాస్టల్ నుంచి ఇంటికి తీసుకె ళ్లడం లేదని మనస్తాపం చెందిన ఓ విద్యార్థిని రెండతస్తుల హాస్టల్ భవనం నుంచి దూకిన ఘటన బుధవారం నస్పూర్ మండలంలో చోటుచేసుకుంది. నస్పూర్ కేజీబీవీ లో అలవాల అక్షర(11) ఆరవ తరగతి చదువుతున్నది. హాస్టల్‌లో చేరిన నాటి నుంచి తల్లిదండ్రులు ఇంటికి తీసుకువెళ్లడం లేదని బెంగతో ఉన్నది. ఆదివారం తండ్రి లక్ష్మణ్ హాస్టల్‌కు వచ్చి మంచిగా చదువుకోమని సముదాయించి వెళ్లిపోయాడు. ఇంటికి తీసుకెళ్లరని మనస్తాపానికి గురైన చి న్నారి బుధవారం ఉదయం హాస్టల్ బిల్డింగ్ రెండో అంతస్తు నుంచి కింద కు దూకింది. హాస్టల్ సిబ్బంది వెంటనే అక్షరను మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు వెన్నెముకలో ఎల్4 దెబ్బతిందని, మెరుగైన వైద్యం కోసం వరంగల్ లేదా హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించారు.